ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ చిత్రానికి ‘అఖిల్’ అని టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా.. అవి చాలా బాగున్నాయంటూ ప్రశంసలొచ్చాయి. ఇప్పుడు అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా తాజాగా టీజర్ ని విడుదల చేశారు.
ఈ టీజర్ లో అఖిల్ యాక్షన్ సన్నివేశాలను అందరినీ అబ్బురపరిచేలా వున్నాయి. కానీ.. ఈ టీజర్ లో ఓ ముఖ్యమైన అంశాన్ని చూపించడం మాత్రం మరిచిపోయారు. ఈ సినిమా కథానేపథ్యం ఏంటో అన్న విషయాన్ని ఈ టీజర్ లో చూపించలేదు. ఏదో ఫార్మాలిటీకి టీజర్ ని విడుదల చేశారే తప్ప.. సరైన అంశాన్ని అందులో చూపించకుండా అభిమానుల్ని నిరాశపరిచారు. ఈ టీజర్ మాస్ ఆడియెన్స్ నచ్చుతుందేమో కానీ.. సాధారణ ఆడియెన్స్ కి మాత్రం కాస్త ఓవర్ డోస్ లా కనిపిస్తోంది. ఏదేమైనా.. తన మొదటి చిత్రానికి సంబంధించిన టీజర్లోనే అఖిల్ అద్భుతంగా తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచాడని ప్రశంసలైతే వస్తున్నాయి.
ఈ చిత్రాన్ని యంగ్ హీరో నిఖిల్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తుండగా.. ఇందులో సాయేషా సెహగల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more