Megastar Chiranjeevi | Birthday special | stills | news | gallery

Megastar chiranjeevi birthday special 2015

Happy Birthday Megastar Chiranjeevi, Megastar Chiranjeevi birthday 2015, Megastar Chiranjeevi stills, Megastar Chiranjeevi special articles, Megastar Chiranjeevi special video, Megastar Chiranjeevi special greetings, Megastar Chiranjeevi songs, Megastar Chiranjeevi latest news, Megastar Chiranjeevi latest posters, Megastar Chiranjeevi

Megastar Chiranjeevi Birthday Special 2015: Wishing a very happy birthday to tollywood megastar chiranjeevi. megastar chiranjeevi 60th birthday celebretions.

మెనీ మోర్ రిటర్న్స్ టు మెగా

Posted: 08/21/2015 06:01 PM IST
Megastar chiranjeevi birthday special 2015

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది నూతన నటీనటులు వచ్చినా కూడా సినీ అభిమానుల్లో ఆయన స్థానం సుస్థిరం. ఆయన వెండితెర మీద కనిపిస్తే అభిమానుల గుండెల్లో సంబరాల మోత. ఎంతో మంది సినీ నటీనటులకు ఆదర్శం ఆయన. ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలే. తెలుగు సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని మొదలుపెట్టిన ఘనత ఆయనకే సొంతం. ఓ సాధారణ నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత సుప్రీం హీరోగా ఎదిగారు. అక్కడ నుంచి తన నటన, డాన్స్, యాక్షన్... ఇలా అన్నీ రంగాల్లో తన సత్తా ఎంటో నిరూపించుకొని శభాష్ అనిపించుకున్నారు. చివరకు టాలీవుడ్ ‘మెగాస్టార్’ అయ్యారు. ఆయన కొణిదెల శివశంకర్ వరప్రసాద్... అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.

తెలుగు సినీ ఇండస్ట్రీకి మూల స్థంభాలుగా నిలిచిన నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణల తర్వాత తరంలో అంతటి స్థాయిలో అభిమానం సంపాదించుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులోని కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ఆగష్టు 22, 1955లో మొదటి సంతానంగా చిరంజీవి జన్మించారు. ఆ తర్వాత 1980లో చిరంజీవి వివాహం ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు.

Video Courtesy : ShemarooTelugu

తనకు సినిమాల పట్ల వున్న ఆసక్తి వల్ల చిరంజీవి చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డిప్లోమా చేసారు. ఆ తర్వాత 1978లో ‘పునాది రాళ్లు’ అనే చిత్రంలో నటించారు. కానీ ఈ సినిమా కంటే ముందుగా చిరంజీవి నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం విడుదలయ్యింది. ఇక అక్కడినుంచి తన స్వయంకృషితోనే పైకెదుగుతు వచ్చారు. నటుడిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన చిరంజీవి... పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు కూడా వేస్తూ ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ఖైదీ’ సినిమా... చిరంజీవిని స్టార్ హీరోగా మార్చేసింది.

‘ఖైదీ’ సినిమా చిరంజీవి సినీ కెరీర్ ను మొత్తం మార్చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో ఒక్కసారిగా చిరు స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అలాగే ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో కమర్షియల్ గా మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. స్వయంకృషి, రుద్రవీణ, ఆపధ్బాందవుడు వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ మన్ననలు పొందారు.

ఆ తర్వాత చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది వంటి సినిమాలతో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిపోయారు. ఈ సినిమాలు ఘనవిజయం సాధించడంతో అభిమానులు చిరుకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇంద్ర, ఠాగూర్ సినిమాలతో చిరంజీవి టాలీవుడ్ లో టాప్ 1 హీరోగా భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. కేవలం తన యాక్టింగ్ తోనే కాకుండా డాన్సుల్లో కొత్త ట్రెండ్ ను సృష్టించి టాలీవుడ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేసారు.

 

chiranjeevi-birthday

చిరంజీవి కేవలం కమర్షియల్ చిత్రాల్లోనే కాకుండా ‘శ్రీమంజునాథ’ వంటి భక్తిరస చిత్రంలో కూడా నటించి మెప్పించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, హిందీ సినిమాల్లో కూడా నటించి, అక్కడ కూడా భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇదంతా చిరంజీవి ఒకవైపు మాత్రమే అయితే.. సిని కెరీర్ లోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా భారీ ప్రజాధారణ సొంతం చేసుకున్నారు.

1988లో ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ స్థాపించారు. అలాగే ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’, ‘చిరంజీవి ఐ బ్యాంక్’ వంటి సంస్థలను స్థాపించి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చిరంజీవి సినిమాల్లోనే కాకుండా, ఇలాంటి పలు సంస్థల వలే సేవా కార్యక్రమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా భారీగా ప్రజాదారణను సొంతం చేసుకున్నారు. అందులో భాగంగానే 2006లో భారత ప్రభుత్వం చిరంజీవికి ‘పద్మభూషణ’ పురస్కారం అందించింది. అలాగే 2006లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ ‘డాక్టరేట్’ ను ఇచ్చి సత్కరించారు.

సినిమాల ద్వారానే కాకుండా రాజకీయాల ద్వారా కూడా ప్రజలకు సేవా అందించాలని 2008లో ‘ప్రజారాజ్యం’ అనే పార్టీ స్థాపించి, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కానీ 2011లో తన ‘ప్రజారాజ్యం’ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్రమంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

ఇప్పటివరకు 149 చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి... తన 150వ సినిమాను త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 150వ చిత్రానికి సంబంధించిన కథచర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు 59 సంవత్సరాలను సంతోషంగా పూర్తి చేసుకొని, 60వ సంవత్సరంలోకి అడుగెడుతున్న మెగాస్టార్ చిరంజీవికి ఈ సంధర్భంగా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగు విశేష్.

Video Courtesy : Aditya Music

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar Chiranjeevi  Birthday special  stills  news  gallery  

Other Articles