Ram Charan | First Look Stills | Rakul preet singh | Srinu Vaitla | Movie News | stills

Ram charan latest movie first look release today night

Ram Charan Latest Film First Look Stills, Srinu Vaitla Confirmed about Chiranjeevi guest role in Ram Charan Film, Ram Charan Movie Shooting in hyderabad, Ram Charan upcoming film, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan film news, Ram Charan movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Ram Charan Latest Movie First Look Release Today Night: Mega Powerstar Ram Charan tej upcoming film First look teaser release today night. srinuvaitla directior. First Look stills released today. DVV Danayya producer. Rakul preet singh heroine. Thaman music.

చరణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ నేడే విడుదల

Posted: 08/21/2015 03:24 PM IST
Ram charan latest movie first look release today night

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీనువైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.

'మెగాస్టార్ చిరంజీవి' స్పెషల్ అప్పియరెన్స్ :
'నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది'. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో నటించే విషయంపై దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ పై విధంగా అన్నారు. చిరంజీవిగారు ఎంతో ఎనర్జిటిక్ గా, మరింత గ్లామరస్ గా ఉన్నారు. ఆయన నటించే సన్నివేశాలను త్వరలో చిత్రీకరించబోతున్నాము. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఓ మాట మాత్రం చెప్పగలను. అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే సన్నివేశాలు తెరకెక్కబోతున్నాయని తెలిపారు దర్శకుడు శ్రీను వైట్ల.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ మరియు 'టీజర్'

మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు నిర్మాత దానయ్య డి.వి.వి. అలాగే ఈ రోజు రాత్రి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సమక్షంలో చిత్రం 'టీజర్' ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ..' మెగాస్టార్ చిరంజీవి గారు మా బ్యానర్లో అందులోనూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'స్పెషల్ అప్పియరెన్స్' లో కంపించనుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా అవి మెగాభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తాయని తెలిపారు నిర్మాత దానయ్య డి .వి.వి.

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను హైదరాబాద్ లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్; లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, దర్శకత్వం: శ్రీనువైట్ల.

cherry-latest-film

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  First Look Stills  Rakul preet singh  Srinu Vaitla  Movie News  stills  

Other Articles