Mahesh Babu comments on Shruti Haasan

Mahesh babu comments on shruti haasan

Mahesh Babu Tweets on Shruti Haasan, Mahesh Babu Tweets, Shruti Haasan tweets, Srimanthudu movie news, Srimanthudu movie collections, Srimanthudu latest news, Srimanthudu collections, Mahesh Babu, Shruti Haasan

Mahesh Babu comments on Shruti Haasan: Shruti Haasan latest chit chat with fans about srimanthudu film. Mahesh babu retweets on shruti haasan tweets. Srimanthudu movie collections report.

చారుశీలపై శ్రీమంతుడు ఫన్నీ కామెంట్లు

Posted: 08/14/2015 11:22 AM IST
Mahesh babu comments on shruti haasan

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా నటించిన ‘శ్రీమంతుడు’ ఇటీవలే విడుదలై భారీ కలెక్షన్ల మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ చాలా చురుకుగా పాల్గొంటున్నారు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నారు.

అయితే ‘శ్రీమంతుడు’ సినిమా గురించి ఇటీవలే మహేష్ బాబు అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసారు. అయితే నిన్న ట్విట్టర్లో హీరోయిన్ శృతిహాసన్ కూడా అభిమానులతో చిట్ చాట్ చేసింది. అయితే ఈ విషయంపై మహేష్ బాబు ట్వీట్ చేసాడు.

ట్విట్టర్లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు శృతిహాసన్ ఫన్నీగా సమాధానాలు ఇచ్చారు. ఈ విషయంపై మహేష్ స్పందిస్తూ... ‘శృతిహాసన్ చిట్ చాట్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూసాను. శృతిహాసన్ కు ఈ చాట్ మంచి ఫన్ ఇచ్చిందని అనుకుంటా’ అంటూ ట్వీట్ చేసాడు.

మహేష్ ట్వీట్ పై శృతిహాసన్ స్పందిస్తూ... ‘అవును. చాట్ సెషన్ చాలా ఫన్ ఇచ్చింది’ అంటూ ట్వీట్ చేసింది. ఎప్పుడూ కూడా ఎక్కువగా మాట్లాడని మహేష్... ఇలా సడెన్ గా సరదా ట్వీట్ చేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babu  Shruti Haasan  Tweets  News  

Other Articles