Ntr latest movie shooting starts from today

Ntr latest movie shooting starts from today

Ntr sukumar movie shooting starts from today, Ntr sukumar movie shooting in london, Ntr sukumar movie shooting date, Ntr sukumar movie shooting details, NTR latest news, NTR movie news, NTR movie updates, NTR stills, NTR latest stills, NTR latest updates, NTR

Ntr sukumar movie shooting starts from today: young tiger jr ntr latest movie shooting starts in london. sukumar director. bvsn prasad producer, devi sri prasad music. rakul preet singh heroine.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా తాజా విశేషాలు

Posted: 07/06/2015 11:12 AM IST
Ntr latest movie shooting starts from today

‘టెంపర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత కొన్ని నెలలు విరామం తీసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొత్త చిత్రాన్ని తాజాగా ప్రారంభించేసాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘నాన్నకు... ప్రేమతో.’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి లండన్ ప్రారంభం కానుంది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 15 వరకు నిరవధికంగా షూటింగ్ జరుపనున్నారు.

ఎప్పుడో ప్రారంభం కావాల్సిన ఈ చిత్రాన్ని ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా కాస్త ఆలస్యం చేసారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో షూటింగ్ ప్రారంభించేసారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన హెయిర్ స్టైల్ మరియు గడ్డంను భారీగా పెంచేసాడు. ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నాడని తెలిసింది.

ఎస్.వి.సి.సి. బ్యానర్ పై ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతుంది. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ లు ముఖ్య పాత్రలలో నటించనున్నారు. 2016 లో సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  sukumar  shooting details  movie news  stills  

Other Articles