Rajamouli dedicate Baahubali movie to KV Reddy

Rajamouli dedicate baahubali movie to kv reddy

Baahubali movie dedicate to Director KV Reddy, Baahubali movie dedicated, Rajamouli Baahubali movie dedicated, Baahubali movie news, Baahubali movie updates, Baahubali movie stills, Baahubali movie trailers, Baahubali movie songs, Baahubali movie censor report, Baahubali movie

Rajamouli dedicate Baahubali movie to KV Reddy: Director SS Rajamouli latest upcoming film Baahubali. Rajamouli dedicated his Baahubali film to Director KV Reddy.

బాహుబలిని ఆ దర్శకుడికి అంకితం చేసిన రాజమౌళి

Posted: 06/23/2015 10:17 AM IST
Rajamouli dedicate baahubali movie to kv reddy

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా ప్రధాన పాత్రలలో నటించిన ‘బాహుబలి’ చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ అభిమానులంతా ‘బాహుబలి’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు ధుమ్మురేపుతున్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ దర్శకుడికి అంకితం ఇస్తున్నట్లుగా చిత్ర దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. ఆయన ఎవరంటే.. అప్పట్లో తెలుగులో పలు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కె.వి.రెడ్డి. 1950-60లలో ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించిన కెవి రెడ్డి అంటే రాజమౌళికి చిన్నప్పటి నుంచి ఇష్టమట. అందుకే ఆయనకు ‘బాహుబలి’ చిత్రాన్ని అంకితం ఇస్తున్నానని ప్రకటించారు.

అలాగే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో లీకైన విషయం తెలిసిందే. ఈ వీడియో గురించి రాజమౌళి మాట్లాడుతూ... ‘మనం ఎంతో నమ్మినవారే మనల్ని ఇలా మోసం చేస్తే చిన్న పిల్లల్లా ఏడవలేకపోయినప్పటికీ... కానీ మనసుకి మాత్రం చాలా భాధగా వుంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా అందరి అంచనాలను అందుకునేలా వుంటుందని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలలో గ్రాండ్ జులై 10న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  Dedicate  Rajamouli  KV Reddy  Prabhas  

Other Articles