Ram Shivam Movie shooting updates

Ram shivam movie shooting updates

Ram Movie Shivam Release in September, Shivam movie news, Shivam movie updates, Shivam movie stills, Shivam movie shooting details, Ram stills, Ram movie news, Ram

Ram Shivam Movie shooting updates: Tollywood actor ram upcoming film Shivam. This film will be release on September. Rashi khanna heroine.

సెప్టెంబర్ లో రానున్న రామ్ శివం

Posted: 06/23/2015 10:26 AM IST
Ram shivam movie shooting updates

రామ్ హీరోగా నటించిన ‘పండగ చేస్కో’ ఇటీవలే విడుదలై పర్వాలేదనిపించింది. రామ్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. ఒకటి ‘శివం’, మరొకటి ‘హరికథ’. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్ ఈ ‘శివం’, ‘హరికథ’ల పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాలతో ఓ కమర్షియల్ హిట్టును సాధించాలని చాలా కసిగా వున్నాడు.

ఇక శివం సినిమా విషయానికొస్తే... శ్రీనివాస్ రెడ్డి అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తూ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర విశేషాలను చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్ తాజాగా తెలియజేసారు.

రవికిషోర్ చిత్ర విశేషాలను తెలియజేస్తూ... ఇది పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమా. ఇందులో క్లాస్, మాస్ ని ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయి. రామ్ పాత్ర చాలా కొత్తగా వుంటుంది. మే 26 నుంచి ఈనెల 12 వరకూ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ జరిపాం. ఈనెల 12 నుంచి ఊటీలో ఓ షెడ్యూల్ ప్రారంభించి వారం రోజుల పాటు షూటింగ్ జరిపాం. దీంతో 70శాతం టాకీ, క్లైమాక్స్ పూర్తయ్యింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  shooting  release date  Rashi khanna  

Other Articles