Cricketer Sreesanth to make his debut in Tollywood!

Cricketer turns actor

Telugu Cinema, Entertainment, sreesanth, telugu movie, crickter sreesanth movie, sana yadi reddy, sreesanth movie, cricketer, srisanth, sreeshanth, tollywood, villian, bollywood, sana yadireddy, Cricketer Sreesanth, Debut in Tollywood, Sreesanth in Telugu Movie, Sana Yadireddy New Project

former Indian cricketer Sreesanth is all set to make his Tollywood debut with producer-director Sana Yadireddy’s new project.

టాలీవుడ్ లోకి మరో హీరో.. అదృష్టాన్ని పరీక్షించుకోనున్న క్రికెటర్

Posted: 06/21/2015 06:03 PM IST
Cricketer turns actor

నూనుగు మీసాలు రావడంతోనే టీమిండియాలో ప్లేస్ సంపాదించిన క్రికెటర్ శ్రీశాంత్. బౌలర్ గా బ్యాట్స్ మెన్లను అదరగోట్టిన ఇతగాడు.. ఐపీఎల్ లో బెట్టింగ్ ఆరోపణలతో క్రికెట్ కు దూరమయ్యాడు. అయితే ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఎలాగైన తాను మళ్లీ టీమిండియాలో స్థానం సంపాదించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. అయితే అంతకన్నా ముందే అతనికి మరో అదృష్టం వచ్చి తగిలింది. అదేంటంటారా..? అదే చిత్రసీమ ఆఫర్. అందులోనూ ఒకటి కాదు ఏకంగా మూడు బాషల్లో చిత్రం రూపోందుతుండగా, ఆ తరువాత మొత్తం భారతీయ భాషలన్నింటిలోనూ అనువాదం కానుందట.

తెలుగు, తమిళం, మలయాళ బాషల్లో షూటింగ్ జరుపుకోనుందట. ప్రముఖ టాలీవుడ్ దర్శక, నిర్మాత సానా యాదిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా క్రికెటర్ శ్రీశాంత్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే చాలా ఇస్టమని చెప్పుకోచ్చారు. తాను చదువుతున్న రోజుల్లోనే పాఠశాలలో పలు నాటకాలలో నటించానని చెప్పారు. అంతేకాదు అతని తండ్రి కూడా మలయాళ చిత్రాలలో నటించారని చెప్పుకోచ్చాడు. మహేష్ బట్ తాజాగా నిర్మిస్తున్న క్యాబరే చిత్రంలో విలన్ గా చేస్తున్నానని చెప్పుకోచ్చాడు శ్రీశాంత్. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో లవ్, రోమాన్స్ కలగలిపి చిత్ర కథ వుంటుందని దర్శకనిర్మాత సానా యాదిరెడ్డి చెప్పారు. జూలై లేదా ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమవుతుందని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricketer  srishanth  tollywood  villian  bollywood  sana yadireddy  

Other Articles