Director Sampath Nandi Birthday special interview

Director sampath nandi birthday special interview

Sampath Nandi latest interview, Sampath Nandi birthday special, Sampath Nandi latest stills, Sampath Nandi movie news, Sampath Nandi movie updates, Sampath Nandi details, Sampath Nandi bengal tiger, Sampath Nandi

Director Sampath Nandi Birthday special interview: Director Sampath Nandi Birthday special interview. Sampath Nandi clarifies on Gabbar singh2 project.

గబ్బర్ సింగ్2పై క్లారిటీ ఇచ్చేసిన సంపత్ నంది

Posted: 06/20/2015 02:02 PM IST
Director sampath nandi birthday special interview

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే ‘గబ్బర్ సింగ్2’ చిత్రానికి ముందుగా సంపత్ నంది దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. ముహూర్త కార్యక్రమాలు అన్ని జరిగిపోయాక ఈ ప్రాజెక్టును ఆపేసారు. ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్2’ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు ఆగిపోవడానికి పలు రకాలు కారణాలు సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ కు నచ్చకపోవడంతోనే ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు ఆగిపోయిందని, అంతేకాకుండా సంపత్ నందిపై పవన్ ఆగ్రహంగా వున్నాడంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయాలపై ఇటీవలే సంపత్ నంది ఓ క్లారిటీ ఇచ్చేసాడు. పవన్ తో తనకు మంచి రిలేషన్ షిప్ వుందని, ఇక తమ స్నేహం కొనసాగుతుందని, అయితే పవన్ కళ్యాణ్ గారికి తనకు కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో మాత్రమే వుందని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు నుంచి తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చిందని కానీ దానికి ఏ వ్యక్తులు కారణం కాదని, ఊహించని అనుభవాలు ఎదురవడం వల్లనే తాను ‘గబ్బర్ సింగ్2’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా సంపత్ నంది చెప్పుకొచ్చాడు. అయితే త్వరలోనే పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తానని, పవన్ గారు కూడా సిద్ధంగా వున్నారంటూ సంపత్ నంది తెలియజేసాడు.

అంతేకాకుండా తనకు రాంచరణ్ తో ‘రచ్చ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని చేసుకొనే అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి, మెగా ఫ్యామిలీకి ఎప్పుడూ రుణపడి వుంటానని అన్నాడు. ఇక ప్రస్తుతం రవితేజతో చేస్తున్న ‘బెంగాల్ టైగర్’ చిత్ర కథ పవన్ తో చేయాలనుకున్న ‘గబ్బర్ సింగ్2’ స్టోరీయే అంటూ వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న కథ వేరు. రవితేజ కోసం రాసుకున్న కథ వేరు. ‘బెంగాల్ టైగర్’ సినిమా కథ పూర్తిగా రవితేజ కోసమే రాసుకున్నదని, ‘గబ్బర్ సింగ్2’ స్టోరీ కాదని తేల్చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampath Nandi  Birthday special interview  Gabbar singh2  Bengal Tiger  

Other Articles