Puri Jagannadh Clarifies on Auto Johnny

Puri jagannadh clarifies on auto johnny

Puri Jagannadh Clarifies on Auto Johnny, Puri Jagannadh Clarifies on Auto Johnny film, Puri Jagannadh Auto Johnny, Puri Jagannadh latest news, Puri Jagannadh latest tweets, Puri Jagannadh tweets, Puri Jagannadh comments, Puri Jagannadh movies, Puri Jagannadh, Auto Johnny.

Puri Jagannadh Clarifies on Auto Johnny: Director Puri Jagannadh Upcoming Film Auto Johnny. Megastar chiranjeevi 150th film. Ram charan producer.

ఆటోజానీ ఫస్ట్ హాఫ్ కేక... సెకండ్ హాఫ్ దద్దరిల్లాల్సిందే ఇక!

Posted: 06/15/2015 12:17 PM IST
Puri jagannadh clarifies on auto johnny

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నాడని, ఈ సినిమాకు ‘ఆటోజానీ’ అనే టైటిల్ కూడా ఖరారు చేసారనే విషయం తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్టు నుంచి పూరీ తప్పుకున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. కారణం హీరో నితిన్ తో పూరీ ఓ సినిమా ఒప్పుకోవడమే.

పూరీ దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసమే పూరీ ‘ఆటోజానీ’ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ చివరకు ఈ విషయంపై పూరీ, నితిన్ లు వేరు వేరుగా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఓ క్లారిటీ ఇచ్చేసారు.

పూరీతో చేయబోయే ప్రస్తుతానికి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, భవిష్యత్తులో మళ్లీ ఎపుడైనా పూరీతో సినిమా చేస్తానని నితిన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చాడు. ఇక చిరుతో ‘ఆటోజానీ’ సినిమా చేసే అవకాశం చేజారిపోయిందనే వార్తలకు పూరీ ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

‘ఆటోజానీ’కి సంబంధించిన ఫస్ట్ హాఫ్ మెగాస్టార్ కు చెప్పిన.. ఆయనకు బాగా నచ్చేసింది. ఇపుడు సెకండ్ హాఫ్ కోసం బాగా హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ హాఫ్ పదిరెట్లు మరింత బెటర్ గా వుండేలా తయారు చేస్తానంటూ పూరీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చేసాడు.

మొత్తానికి చిరు 150వ చిత్రం ‘ఆటోజానీ’ స్ర్కిప్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చకచకా జరిగిపోతున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రంలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Auto Johnny  Chiranjeevi  Movie News  

Other Articles