Tamil Actor Amitash Pradhan in Ram Charan Film

Tamil actor amitash pradhan in ram charan film

Amitash Pradhan in Ram Charan Film, Ram Charan movie news, Ram Charan movies, Ram Charan movie updates, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan stills, Ram Charan

Tamil Actor Amitash Pradhan in Ram Charan Film: Ram charan latest film in Srinuvaitla direction. Rakul preet singh heroine. Amitash Pradhan acts in special role.

రాంచరణ్ తో రఘువరన్ విలన్

Posted: 06/15/2015 10:19 AM IST
Tamil actor amitash pradhan in ram charan film

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’, ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో ఓ తమిళ విలన్ వచ్చి చేరినట్లుగా తెలిసింది.

ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బిటెక్’ చిత్రంలో విలన్ గా నటించిన అమితాష్ ప్రధాన్ కు నటుడిగా మంచి మార్కులే పడ్డాయి. ఇందులో యువ రిచ్ బిజినెస్ మాన్ పాత్రలో చాలా బాగా నటించాడు. అయితే అమితాష్ కు తెలుగులో చరణ్ సినిమాలో ఓ పాత్రలో నటించే అవకాశం దక్కింది.

ప్రస్తుతం చరణ్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈనెల 18నుంచి అమితాష్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఇందులో అమితాష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలిసింది. మరి తెలుగులో అమితాష్ కు ఎలాంటి విజయం అందించనుందో చూడాలి.

కోనవెంకట్, గోపి మోహన్ కథను సమకూరుస్తున్నారు. రాంచరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Amitash Pradhan  Movie News  

Other Articles