baahubali team visited tirumala

Anushka shetty mobbed

Anushka Shetty mobbed, Baahubali, baahubali team visited tirumala, anushka shetty, audio release, tirupati, tollywood, rajamouli, tirumala, baahubali team, krishnan raju

Anushka Shetty was mobbed by her fans when Baahubali actor visited Vesnkateshwara Swamy temple in Tirupati on Sunday morning

అభిమానుల అత్యుత్సాహంతో విసిగిపోయిన అనుష్క

Posted: 06/14/2015 03:40 PM IST
Anushka shetty mobbed

మునుపెన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో.. బహుబాషల్లో రూపోందుతున్న బాహుబలి చిత్రం విజయం సాధించాలని కోరుతూ తిరుమల:శ్రీవారి దర్శనార్థం వెళ్లిన అనుష్కకు ఊహించని పరిణామం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహంతో అమె విసిగిపోయింది. తిరుమల కోండపైకి నడకదారిలో వెళ్లాలని యోచించిన అమెకు అభిమానుల తాకిడి అడుగు ముందుకెయనీలేదు. ఆదివారం ఉదయం తిరుమల కొండపైకి వెళ్లిన అమెకు అభిమానులు చుక్కలు చూపించారు. క్రితం రోజు రాత్రి తిరుపతి వెంకన్న సాక్షిగా బాహుబలి సినిమా ఆడియో విడుదల చేసింది చిత్ర యూనిట్, ఈ నేపథ్యంలో నిన్న అక్కడే వుండిపోయిన చిత్ర యూనిట్ కు చెందిన అనుష్క, రమ్యకృష్ణ, కృష్ణంరాజు సహా పలువురు నటులు అక్కడే వుండి ఇవాళ శ్రీవారిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు.

 

 

 ఈ క్రమంలోనే  కొంతదూరం నడకదారిలో దర్శనానికి వెళ్లిన అనుష్కకు అభిమానులు నుంచి తీవ్ర నిరాశే ఎదురైంది. ఆమెను చూసేందుకు అభిమానులు క్యూకట్టడంతో అనుష్క కాస్త అసహనానికి గురైయ్యారు. ఓ దశలో అభిమానులు అదుపుతప్పి అనుష్క మీద పడబోయారు. దీంతో ఆమె విసుక్కుంటూ అతికష్టం మీద ఆలయం వద్దకు కారు ద్వారా చేరుకున్నారు. అనుష్క తో పాటు ఇవాళ పలువురు ప్రముఖులు వేర్వేరుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారిని దర్శించుకున్నారు.  నటుడు రెబల్‌స్టార్ కృష్ణంరాజు సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరితో పాటు నటి రమ్యకృష్ణ, సినిమాటోగ్రాఫర్ సెంథిల్, హీరో కౌశిక్‌బాబులు స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావులు స్వామి వారిని దర్శించుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : tirumala  baahubali team  Anushka Shetty  

Other Articles