Bahubali Audio Release Function Live Streaming | Tirupati SV University Stadium | Rajamouli

Bahubali audio release function live streaming tirupati sv university stadium

bahubali audio live, bahubali audio launch, bahubali audio updates, bahubali movie news, bahubali gallery, bahubali photos, bahubali gallery, bahubali news, bahubali live streaming, tv5 news channel, tv5 news channel live

Bahubali Audio Release Function Live Streaming Tirupati SV University Stadium : The Live Streaming Of Bahubali Audio Release Which is Held in Tirupathi SV University Stadium.

లైవ్ : ‘బాహుబలి’ ఆడియో వేడుకను వీక్షించండి

Posted: 06/13/2015 06:17 PM IST
Bahubali audio release function live streaming tirupati sv university stadium

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘బాహుబలి’ ఆడియో విడుదల కార్యక్రమం తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. అక్కడ ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భ్రదతతో భారీ స్థాయిలో నిర్మించిన ఈ ఆడియో వేడకను వీక్షించేందుకు వేలాదిమంది అభిమానులు హాజరయ్యారు. దేశంలోనే భారీ బడ్జెట్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది కాబట్టి.. ఎందరో సినీ ప్రముఖులు ఈ ఆడియోని వీక్షించేందుకు వచ్చారు. ఈ ఆడియో వేడుకకు చిత్రబృందం ఇప్పటికే హాజరయ్యారు.

రాజమౌళితోపాటు చిత్రబృందం ప్రముఖులు ముందునుంచే తిరుపతిలో వుండగా.. అనంతరం ‘బాహుబలి’ వీరులైన ప్రభాస్, రానా హాజరయ్యారు. అలాగే.. దగ్గుబాటి కుటుంబసభ్యుల్లో సురేష్ బాబుతోపాటు మరికొందరు, ఈ చిత్రానికి పాటలు స్వరపరిచిన ఎంఎం కీరవాణీ, రాజమౌళి సతీమణి, తమన్నా, అనుష్క, ఇంకా ఇతర సినీ ప్రముఖులు విచ్చేశారు. ఇక యాంకర్ గా సుమా తన మాటలతో మంత్రం చేయడం మొదలుపెట్టగా.. టాలీవుడ్ లో పేరుమోపిన సింగర్లు తమ స్వరంతో అక్కడికి విచ్చేసిన జనాలను అలరించడంలో బిజీ అయ్యారు.

2013 జూలై నెలలో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. 2015లో పూర్తయ్యింది. దాదాపు రూ.150 కోట్లకుపైగా భారీ బడ్జెట్టుతో ఆర్కా మీడియా సంస్థ నిర్మించిన ఈ మూవీని హాలీవుడ్ తరహాలో రూపొందించారు. ఈ సినిమాకోసం ప్రభాస్ 300 రోజులపాటు ఎంతో కష్టపడ్డాడు. ఇక ఇతని తోటి నటీనటులు కూడా ఈ సినిమా కోసం ఎంతో కసరత్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali audio live  tv5 live streaming  

Other Articles