A prestigious museum here will honour Mani Ratnam with a special tribute | Kollywood News

New york museum to honour director mani ratnam kollywood

Mani Ratnam news, Mani Ratnam updates, Mani Ratnam new york museum, new york museum, indian film industry, Mani Ratnam movies, dilse movie news, bombay movie news, roja movie news, telugu directors, tamil directors

New York museum to honour Director Mani Ratnam Kollywood : A prestigious museum here will honour Mani Ratnam with a special tribute, which it said has been “long overdue” for the “important filmmaker”. Mani Ratnam, 59, will make a rare appearance at the Museum of the Moving Image for the tribute from July 31 to August 2 during which Roja, Bombay and Dil Se will be screened.

దేశానికి అరుదైన గౌరవం తెచ్చిన మణి‘రత్నం’

Posted: 06/13/2015 04:30 PM IST
New york museum to honour director mani ratnam kollywood

దేశంలో గర్వించదగిన దర్శకులందరిలో మణిరత్నం ఒకరు. ఎందుకంటే.. మనుషుల్లోని దాగిన మానవత్వాన్ని తన సినిమాల ద్వారా వెలికితీయడంలో ఈయనకు ఈయనే సాటి! అంతేకాదు.. కులమత విద్వేషాలు మానుకోవడం వల్ల కలిగే ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఈ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు చూడాల్సిందే! మొత్తంగా చెప్పాలంటే.. ఈయన సినిమాలు ప్రతిఒక్కరి మనసులో సోదరభావం ఉట్టిపడేలా సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇలా ఈ విధంగా ప్రేమ, సోదరభావం వంటి కాన్సెప్టులే మణిరత్నానిక అరుదైన గౌరవాలు తెచ్చిపెట్టాయి. మణిరత్నంలోని ప్రత్యేకతే ఆయన సినిమాలకు ‘న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ ది మూవింగ్ ఇమేజ్’లో స్థానం లభించేలా చేసింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినీరంగ ప్రముఖుల జీవితాలను న్యూయార్క్ మ్యూజియంలో డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శిస్తారు. అనంతరం వారిని సత్కరిస్తారు. ఇటువంటి ఆహ్వానమే తాజాగా దర్శకుడు మణిరత్నానికి వచ్చింది. ఈయన దర్శకత్వం వహించిన ‘రోజా’, ‘బాంబే’, ‘దిల్ సే’ వంటి చిత్రాలను ఈ మ్యూజియంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు ప్రదర్శిస్తారు. ఆ తరువాత చర్చావేదికను నిర్వహించి.. మణిరత్నాన్ని సత్కరిస్తారు. ఈ విధమైన సత్కారం మణికి లభించడంతో ఆయన ఎంతో సంతోషంగా వున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అటు.. ఇండియన్ ఇండస్ట్రీలోని ప్రముఖులు మణికి దక్కిన ఈ గౌరవంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి అరుదైన గౌరవం మణికి లభించడం.. భారతీయ సినీ పరిశ్రమకు గర్వించదగినదిగా పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  New York Museum  

Other Articles