aamir khans pk makes history with rs 100 crore in china

Pk grosses record 100 million yuan in china

aamir khans pk makes history with rs 100 crore in china, Bollywood superstar Aamir Khan, Bollywood, Aamir Khan, PK, 100 million yuan, China, Aamir Khan, PK movie, Rs 100 Crore, China yuan, anushka sharma,

Bollywood superstar Aamir Khan's PK has set a new record grossing 100 million yuan (USD 16.70 million) in China.

అమీర్ ‘పీకే’ అదరగొడుతోంది.. 100 మిలియన్ యాన్ల వసూలు..

Posted: 06/07/2015 09:58 PM IST
Pk grosses record 100 million yuan in china

బాలీవుడ్ సెన్సెషనల్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ సినిమా 'పీకే' కొత్త రికార్డు సృష్టించింది. అదేంటి.. అప్పుడెప్పుడో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు రికార్డులను బద్దల కోట్టడమేమిటని అలోచనలో పడ్డారా..? అవును అది నిజమే. అది రికార్డులను తిరగరాసిన తొలి బాలివుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది. అయితే ఈ రికార్డులు సృష్టించింది మాత్రం మన దేశంలో కాదు. విదేశంలో. అదే ఎక్కడా..? అంటారా.. చైనాలో.  చైనాలో విజయవంతంగా ఆడుతున్న పీకే 100 కోట్లు రూపాయల వసూళ్లు సాధించింది.

భారత్ వెలుపల ఒకే దేశంలో ఇంత మొత్తం వసూలు తొలి బాలీవుడ్ సినిమాగా పీకే ఘనత సాధించింది. గల నెల 22 న చైనాలో 4600 స్క్రీన్లపై పీకే విడుదలైంది. విడుదలయిన 16 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్, అనుష్క వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన 'పీకే' బాలీవుడ్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 615 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  PK movie  Rs 100 Crore  China  

Other Articles