Ram Gopal Varma returns with new film 'Secret'

Official poster of rgvs new film secret released

Bollywood, Secret, Ram Gopal Varma, Sachiin Joshi, Tisca Chopra, Makarand Deshpande, Kainaat Arora, Meera chopra, RGV, Satya 2,, box-office, Hindi film "SECRET" Ram Gopal Varma moives, Ram Gopal Varma collections, Ram Gopal Varma hits

National Award-winning filmmaker Ram Gopal Varma today unveiled the first poster of Secret, his first Bollywood film after a gap of almost two years.

సీక్రెట్ చిత్రంతో రెండేళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్ లోకి..

Posted: 06/07/2015 10:02 PM IST
Official poster of rgvs new film secret released

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సీక్రెట్. ఆ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ను వర్మ ఆదివారం ముంబైలో ఆవిష్కరించారు. దాదాపు రెండేళ్ల తర్వాత బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. 2013, నవంబర్ లో హిందీలో ఆయన దర్శకత్వంలో రూపొందిన సత్య 2 విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర తర్వాత నా మొదటి హిందీ చిత్రం సీక్రెట్ను నిర్మిస్తున్నట్లు  ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ఈ చిత్రానికి ముందు టైటిల్ గా 'ద ఎఫైర్' అనుకున్నామని కానీ సీక్రెట్ పేరు ఖరారు చేశామన్నారు.

ఈ చిత్రంలో సచిన్ జోషి, కైనత్ అరోరా, టిస్కా చోప్రా, మీరా చోప్రాలు నటిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. కాగా ఈ చిత్రం తెలుగులో మొగలిపువ్వు పేరుతో  విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామ్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన చిత్రం ఖైదీ. ఈ చిత్రంలోని రగులుతుంది మొగలిపోద అనే పాట నుంచి ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు గతంలోనే వర్మ వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  National Award-winning filmmaker  Secret  first poster released  

Other Articles