Ram Gopal Varma | Tweets | Puri jagannadh

Ram gopal varma tweets on mahesh puri film

RGV Comments on Mahesh Puri Hattrick film, RGV Comments on Mahesh film, RGV Comments on Puri Hattrick film, RGV Comments on Mahesh, Ram Gopal Varma latest news, Ram Gopal Varma movie news, Ram Gopal Varma tweets

Ram Gopal Varma Tweets on Mahesh Puri film: Ramgopal varma hot comments on Puri jagannadh upcoming project with Mahesh babu.

మహేష్ పూరీలపై వర్మ భజన కార్యక్రమం ప్రారంభం

Posted: 05/14/2015 04:33 PM IST
Ram gopal varma tweets on mahesh puri film

మాములుగా పూరీ సినిమాల విషయంలో వర్మ భజన కార్యక్రమం భారీగా వుంటుందనే విషయం తెలిసిందే. ఇటీవలే ఎన్టీఆర్ తో పూరీ తీసిన ‘టెంపర్’ సినిమా విడుదల సమయంలో... ‘టెంపర్’ సినిమాపై వర్మ భారీ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కానీ ఇపుడేమో కేవలం కథ మాత్రమే విని పూరీ, మహేష్ లను తెగ పొగిడేస్తున్నాడు.

మహేష్ బాబుతో హ్యట్రిక్ చిత్రం తీయడానికి ఓ స్ర్కిప్టును ఫైనలైజ్ చేసినట్లుగా దర్శకుడు పూరీ జగన్నాధ్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై రాంగోపాల్ వర్మ భారీ కామెంట్లు చేసారు. వర్మ శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కూడా... పూరీ తనదైన శైలిలో కమర్షియల్ హిట్ చిత్రాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ టాప్ 5 దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు.

‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ సినిమాల తర్వాత మహేష్ తో తీయబోయే హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన కథను పూరీ తాజాగా వర్మకు వినిపించాడట. ఇక వర్మ ఈ సినిమా ఎలా వుండబోతుందనేది తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నాడు.

ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర, డైలాగులు సన్నీ లియోన్ కంటే పది రెట్లు సెక్సీగా ఉంటాయని, పోకిరీ, బిజినెస్మ్యాన్, దూకుడు కంటే కూడా పదిరెట్లు బాగుంటాయని వర్మ తెలిపాడు. తాను విన్న స్టోరీ ప్రకారం అయితే పూరీ జగన్నాథ్, మహేశ్ బాబు కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తారని, హీరోయిజం కూడా హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతుందని రాంగోపాల్ వర్మ చెప్పాడు.

వర్మ స్పందిస్తూ... ఇప్పుడే పూరీ, మహేష్ స్టోరీ విన్నానని, ఇది ఇప్పటివరకు మహేష్ పోషించిన అన్ని సినిమాల పాత్రల కంటే, పూరీ తయారుచేసిన క్యారెక్టర్ల కంటే 10 రెట్లు బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో మహేష్ డైలాగ్స్ మరియు క్యారెక్టర్ సన్నీలియోన్ కంటే 10 రెట్లు సెక్సీగా వుంటాయని, 10 రెట్లు బహుబలి, పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్ ల కంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. పూరీ, మహేశ్ కలిసి యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాల విషయంలో సరికొత్త రికార్డు సృష్టిస్తారని, హీరోయిజం కూడా హిమాలయాలంత ఎత్తుకు ఎదుగుతుందని వర్మ చెప్పాడు.

RGV Comments on Mahesh Puri Hattrick film-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Tweets  Puri jagannadh  Mahesh Babu  

Other Articles