Trisha | Confirmed | Marriage Breakup

Trisha confirmed her marriage break up news

Trisha Confirmed her Break Up, Trisha Breakup confirmed, Trisha Breakup news, Trisha Breakup details, Trisha Breakup updates, Trisha latest news, Trisha movie news, Trisha hot news, Trisha latest updates, Trisha mother, uma krishnan

Trisha Confirmed her Marriage Break Up news: Trisha, Varun manian marriage breakup. this news confirmed by her mother uma krishnan and recently trisha also confirmed from social media.

ఎట్టకేలకు స్పందించిన త్రిష.. ఒంటరిగా, సంతోషంగానే వుందట!

Posted: 05/08/2015 11:12 AM IST
Trisha confirmed her marriage break up news

త్రిష, వరుణ్ ల పెళ్లి ఆగిపోయిందని వస్తున్న వార్తలకు తల్లికూతుళ్లిద్దరూ ఫుల్ స్టాప్ పెట్టేసారు. త్రిష, వరుణ్ ల పెళ్లి బ్రేకప్ అయినట్లుగా త్రిష తల్లి ఉమాకృష్ణన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై త్రిష కూడా స్పందించింది. త్రిష నిశ్చితార్థం ఇటీవలే వరుణ్ మాణియన్ అనే వ్యాపారవేత్తతో ఘనంగా జరిగింది.

నిశ్చితార్థం తర్వాత పెళ్లి వార్త చెబుతుందని ఎదురు చూసిన అభిమానులకు, సన్నిహితులకు త్రిష షాకిచ్చింది. తన పెళ్లి విషయాన్ని పక్కనపెట్టి వరుస సినిమాలను అంగీకరిస్తూ బిజీ అయిపోయింది. దీంతో త్రిష, వరుణ్ లు విడిపోయినట్లుగా వార్తలొచ్చాయి. ఈ బ్రేకప్ విషయంపై త్రిష, వరుణ్ లు కూడా స్పందించలేదు. పైగా త్రిష తన నిశ్చితార్థపు ఉంగారం తన వేళికి ఉంచుకోకపోవడం, త్రిష పుట్టినరోజున వరుణ్ శుభాకాంక్షలు తెలియజేయకపోవడంతో ఈ బ్రేకప్ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు.

కానీ అందరూ అనుకున్నట్లుగానే వీరిద్దరూ బ్రేకప్ అయినట్లుగా త్రిష తల్లి ఉమాకృష్ణన్ ప్రకటించారు. త్రిష, వరుణ్ లు బ్రేకప్ అయ్యారని తెలిపారు కానీ బ్రేకప్ కు గల కారణాలను ఉమా కృష్ణన్ తెలియజేయలేదు. ఎవరిని బాధించడం ఇష్టం లేకనే కారణాలు చెప్పట్లేదని, ప్రస్తుతం త్రిష తన సినిమాలపైనే దృష్టి పెట్టిందని ఉమాకృష్ణన్ చెప్పుకొచ్చారు.

అయితే తాజా తన బ్రేకప్ విషయంపై త్రిష కూడా స్పందించింది. ‘నేనిప్పుడు ఒంటరిగా, సంతోషంగా వున్నాను థ్యాంక్యూ’ అంటూ త్రిష సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు వీరి బ్రేకప్ పై వస్తున్న వార్తలకు పూర్తి క్లారిటీ లభించింది. ఇక ఈ అమ్మడు మళ్లీ ఎవరితో ప్రేమలో పడనుందో భవిష్యత్తులో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Confirmed  Marriage  Breakup  

Other Articles