allu arjun reveals why he reject a special role in abcd 2 movie | Dancing Movies

Allu arjun rejects bollywood offer abcd 2 movie updates

allu arjun news, allu arjun gossips, allu arjun updates, allu arjun abcd 2, abcd 2 movie news, abcd 2 movie updates, remo dsouza, shraddha kapoor, varun dhawan, prabhu deva

allu arjun rejects bollywood offer abcd 2 movie updates : Finally stylish star allu arjun reveals why he rejects a special character role in abcd 2 movie.

బన్నీ బాలీవుడ్ ఆఫర్ ఎందుకు ‘నో’ అన్నాడంటే..

Posted: 04/23/2015 07:49 PM IST
Allu arjun rejects bollywood offer abcd 2 movie updates

డిఫరెంట్ మేనరిజంతో ఇటు తెలుగుతోపాటు మలయాళంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్! ముఖ్యంగా ఇతడు చేసే ఎనర్జిటిక్ డ్యాన్స్ కి దక్షిణాది పరిశ్రమే కాకుండా బాలీవుడ్ సైతం దోసోహమే! అందుకే.. ఇతని డబ్బింగ్ సినిమాలన్నింటికి అక్కడ బాగానే క్రేజ్ వుంది. ఇంతవరకు ఇతడు డైరెక్ట్ గా హిందీ సినిమాల్లో నటించకపోయినా.. డ్యాన్సింగ్ స్టార్ గా అక్కడ కూడా ఇతనికి పేరుంది. ఈ క్రమంలోనే ఇతనికి ఇటీవలే కాలంలో ఓ బాలీవుడ్ ఆఫర్ వరించింది. డాన్స్ ప్రధాన ఇతివృత్తంగా తెరేకేక్కిన ‘ఎబిసిడి 2’లో బన్నీ ఓ ముఖ్య పాత్రలో కనిపించానున్నాడని ఇటీవలే వార్తలొచ్చాయి. అయితే.. ఆ వార్తలను ఖండిస్తూ తాను ఆ సినిమాలో నటించడం లేదని బన్నీ స్పష్టం చేశాడు.

‘ఎబిసిడి 2’ సినిమాలో ఓ పాత్రలో నటించే ఆఫర్ వచ్చిన మాట వాస్తవమేనన్న బన్నీ.. కానీ అందులో నటించేందుకు తాను ఒప్పుకోలేదని తెలిపాడు. ఈ విషయమై బన్నీ మాట్లాడుతూ.. ‘నేను బాలీవుడ్ సినిమాలు చేయడానికి వ్యతిరేకిని కాను.. హిందీ సినిమలు చేయడం నాకూ ఇష్టమే! కానీ ఆఫర్ వచ్చింది కదా అని వెంటనే ఒప్పుకోను. నాకు రైట్ స్టొరీ అని అనిపిస్తే చేస్తాను. ‘ఎబిసిడి 2’లో నా పాత్ర నాకు పర్ఫెక్ట్ గా అనిపించలేదు. అందుకే చేయలేదు. ముఖ్యంగా అతిధి పాత్రలు చేయాలని అస్సలు అనుకోవడం లేదని’ అని స్పష్టం చేశాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/O సత్యమూర్తి’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. అల్లు అర్జున్ ప్రస్తుతం బోయపాటి సినిమా కోసం సిద్దమవుతున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : allu arjun  abcd 2 movie  shraddha kapoor  remo dsouza  

Other Articles