Naga Chaitanya Latest Flick Dochey Movie Premiere Talk | Tollywood updates

Naga chaitanya dochey movie premiere talk updates telugu reviews kriti sanon nagarjuna

naga chaitanya, dochey movie review, dochey review, dochey premiere talk, dochey audience talk, dochey first talk, dochey movie updates, dochey movie gossips, dochey collections, kriti sanon, nagarjuna news, sudheer varma

Naga chaitanya dochey movie premiere talk updates telugu reviews Kriti sanon Nagarjuna : King Nagarjuna praises his son's latest project dochey movie. He told that last 30 minutes of this movie is highlight. Unit members expecting high collections.

చివరి 30 నిముషాలు ‘దోచేసిన’ చైతూ

Posted: 04/24/2015 10:23 AM IST
Naga chaitanya dochey movie premiere talk updates telugu reviews kriti sanon nagarjuna

‘స్వామిరారా’ వంటి థ్రిల్లింగ్ చిత్రాన్ని తెరకెక్కించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ‘దోచేయ్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే! దొంగతనాల నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా ఈరోజు (24-04-2015) ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమాను వీక్షించిన ప్రతిఒక్కరు చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. మరోవైపు.. ఈ మూవీ ఇంకా విడుదల కాకముందే చైతూ తండ్రి నాగార్జున ఈ చిత్రం స్పెషల్ షోని వీక్షించారు. ఈ క్రమంలోనే ఆయన ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

‘దోచేయ్’ స్పెషల్ షో చూసిన అనంతరం నాగ్ మాట్లాడుతూ.. ‘ఈ మూవీ స్పెషల్ షో చూశాను. ఈ సినిమా చాలా ఎంటర్ టైనింగ్ గా వుంది. ముఖ్యంగా చివరి 30 నిమిషాలు చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. ఆ చివరి భాగం అందరినీ ఆకట్టుకుంటుంది’ అంటూ తెలిపారు. అటు యూనిట్ సభ్యులు సైతం ఈ సినిమా సినిమా సూపర్ హిట్ అవుతుందని, చైతూ కెరీర్ లోనే ‘ది బెస్ట్ మూవీ’గా నిలిచిపోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో చైతూ సరసన కృతి సనన్ నటన కూడా చాలా అద్భుతంగా వుందని.. అలాగే మిగతా నటీనటులు తమతమ పాత్రలకు బాగానే న్యాయం చేశారని అంటున్నారు.

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లిమిటెడ్ పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సన్నీ ఎం.ఆర్ సంగీతం అందించారు. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో మంచి కలెక్షన్లు తెచ్చిపెడుతందని నిర్మాతతోపాటు డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ‘ఒక లైలా కోసం’లో లవర్ బాయ్ గా నటించిన చైతూ.. ‘దోచేయ్’లో దొంగగా అద్భుతంగా నటించాడని సినీ ప్రముఖులతోపాటు అభిమానులు ప్రశంసిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dochey review  naga chaitanya  sudheer varma  kriti sanon  akkineni nagarjuna  

Other Articles