Malayalam Star Mohan Lal Telugu Movie | Junior Ntr Sukumar Movie Updates

Mohanlal father character junior ntr sukumar movie

mohanlal news, mohanlal updates, mohanlal gossips, junior ntr news, junior ntr movies, junior ntr updates, director sukumar news, sukumar updates, sukumar junor ntr movie

mohanlal father character junior ntr sukumar movie : Accoring to sources Mohanlal may act as father role for junior ntr latest flick which will direct by sukumar.

మోహన్ లాల్ సముదాయిస్తే.. జూనియర్ వింటాడా?

Posted: 04/17/2015 07:45 PM IST
Mohanlal father character junior ntr sukumar movie

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో చేపట్టనున్న కొన్ని ప్రణాళికల్లో భాగంగా మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా పాలుపంచుకోనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఇండస్ట్రీలో చర్చలు కూడా కొనసాగుతున్నాయి. అయితే.. జూనియర్ చేసే అవకతవకలకు మోహన్ లాల్ సముదాయిస్తే ఆయన వింటాడా..? లేదా..? అన్నది కాస్త టెన్షన్ గా మారింది. ఇంతకు వీరిద్దరు ఎటువంటి ప్రణాళికలు చేపట్టనున్నారు..? వీరు బిజినెస్ పెట్టనున్నారా..? అనేగా మీ సందేహం! ఆ సందేహాల చిక్కుముడి నుంచి విముక్తి పొందాలంటే.. వివరాలు తెలుసుకోవాల్సిందే!

చాలాకాలం తరువాత ‘టెంపర్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న జూనియర్.. తన తదుపరి చిత్రం సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమాతోనూ మరో ఘనవిజయాన్ని నమోదు చేసుకోవాలని ఎన్టీఆర్ ఆశిస్తున్నాడు. అందుకే.. ఈ సినిమాకోసం ఎక్కువ డేట్స్ కేటాయించడంతోపాటు గతంలో ఎన్నడూలేని విధంగా తన గెటప్ ను మార్చుకుంటున్నాడు. సరికొత్త కథతో తెరకెక్కనున్న ఈ మూవీలో కాస్త కొత్తదనం ఇతర చిత్రరంగానికి చెందిన సూపర్ స్టార్స్, నటీనటులను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల ఓ కీలకపాత్రలో నటించనున్నాడని వార్తలు వెలువడుతున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కు తండ్రిగా జగపతి బాబు నటిస్తున్నాడని గతంలో వార్తలు వెలువడిన విషయం తెలిసిందే! అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జగపతి ఈ సినిమాలో రోల్ లో కనిపించనున్నాడని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో జగపతి బాబుది నెగిటివ్ రోల్ అని దాదాపు క్లారిటీ రావడంతో.. మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ నటించే ఛాన్స్ ఉందని టాక్ మొదలైంది. ఈయనను తమ సినిమాలో తీసుకుంటే.. అటు మలయాళంలోనూ తమ చిత్రానికి క్రేజ్ వస్తుందని.. ఇటు తెలుగులోనూ కలెక్షన్లు భారీగా వస్తాయన్న నమ్మకంతో ఆయనతో ఈ పాత్ర కోసం సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొస్తున్నాయి.

చాలా  ఏళ్ల క్రితం రిలీజైన 'గాండీవం' సినిమాలో తళుక్కుమన్న మోహన్ లాల్.. ఇప్పటి వరకు మరే తెలుగు స్ట్రెయిట్ మూవీలో యాక్ట్ చేయలేదు. అయితే కోలీవుడ్ లో విజయ్ హీరోగా నటించిన ‘జిల్లా’ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ లాల్.. ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఈ సినిమాలో మోహన్ లాల్ నటిస్తే... అది ఆ సినిమాకు ఎంతో కొంత అడ్వాంటేజ్ గా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohanlal  sukumar junor ntr movie  tollywood gossips  

Other Articles