nayanthara renumeration more than super star mommootty

Its 1 crore for nayanthara and just 50 lakhs for mammootty

nayanthara renumeration more than super star mommootty, nayanthara Trisha, nayanthara latest news, nayanthara movies, nayanthara photos, nayanthara gossips, nayanthara movie collections, nayanthara latest updates, nayanthara movie news, nayanthara movies news, nayanthara renumeration, kollywood,

nayanthara gets more renumeration than super star mommootty in kollywood, she collects 1 crore whereas mammootty gets just 50 lakhs

ఆ విషయంలో మాత్రం వెనక్కు తగ్గనటున్న నయన

Posted: 04/12/2015 03:20 PM IST
Its 1 crore for nayanthara and just 50 lakhs for mammootty

పట్టువిడుపుల గురించి నటి నయనతారనే అడిగి తెలుసుకోవాలి. ఈ విషయంలో ఆమెకు మించిన జాణ లేరనిపిస్తోంది. అందుకే నయనతార వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా వృత్తిపరంగా టాప్ హీరోయిన్‌గానే వెలుగొందుతున్నారు. అసలు విషయం ఏమిటంటే ఈ కేరళకుట్టి ప్రస్తుతం పుచ్చుకుంటున్న పారితోషికం రెండు కోట్లుపైనే అని కోలీవుడ్ టాక్. ఇటీవల నటించిన నన్బేండా చిత్రం కోసం ఆ చిత్రం కథానాయకుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ నయనతార కు రెండున్నర కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఆమె చాలా కాలం తరువాత మాతృభాషలో మమ్ముట్టి సరసన ఒక చిత్రం చేశారు.
 
 ఆ చిత్రానికి నయనతార తీసుకున్న పారితోషికం కేవలం 50 లక్షలేనట. అలా సొంత గడ్డపై చేసిన చిత్రం కోసం అంత ఉదార స్వభావం చూపిన మలయాళి భామ సమీపంలో ఒక వాణిజ్య ప్రకటనలో నటించడానికి రెండు రోజులు కాల్‌షీట్స్ కోసం డిమాండ్ చేసిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాల నాలుగుకోట్లు అని సమాచారం.
 
 మరో విషయం ఏమిటంటే తన తరువాత అనుష్క, సమంత, శ్రుతిహాసన్, కాజల్ అగర్వాల్, ఎమిజాక్సన్ హీరోయిన్లు వచ్చినా నయనతార నక్షత్ర అంతస్థు ఏ మాత్రం తగ్గలేదు. సుమారు రెండేళ్లు నటనకు గ్యాప్ ఇచ్చి రీఎంట్రీ అయినా తన పూర్వస్థానాన్ని పదిలపరచుకున్న నటి ఎవరైనా కోలీవుడ్‌లో ఉన్నారంటే అది నయనతారనే. ఆ సంచలన నటి చిత్ర చిత్రానికి 30 లక్షలు పారితోషికం పెంచుకుంటూ పోతున్నారన్నది కోలీవుడ్ టాక్. అందుకే అంటున్నారు నయనతార మజాకా అని

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nayanthara nayanthara latest news  kollywood  mammootty  

Other Articles