anjali gets plenty offers from kollywood

Anjali in karthik subbarajs iraivi

anjali in karthik subbarajs iraivi, anjali gets plenty offers from kollywood, anjali, Anjali, Anjali latest news, Anjali movies, Anjali photos, Anjali gossips Anjali movie collections, Anjali latest updates, Anjali movie news, Anjali movies news, Anjali renumeration, kollywood, offers surround Anjali

anjali gets plenty of offers from kollywood and tollywood

వరుస ఆఫర్లతో నటి అంజలి ఉక్కిరి బిక్కిరి..

Posted: 04/12/2015 02:07 PM IST
Anjali in karthik subbarajs iraivi

తెలుగు రాష్ట్రానికి చెందిన అమ్మడు.. పక్కింటిలో పేరు తెచ్చుకుని తారగా ఎదిగింది. ఎవరా అని అలోచించకండీ అమె అంజలి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుంచి తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న ఈ అమ్మడు తెలుగులోనే సెటిల్ కావడంతో కోలీవుడ్‌లో అమె చాప్టర్ క్లోజ్ అని చాలామంది అనుకున్నారు. అయితే టాలీవుడ్‌లోనూ వరుసగా రెండు మూడు అవకాశాలు వచ్చినా ఆ తరువాత ముఖం చాటేయడంతో అంజలి పరిస్థితి అయోమయంగా మారింది. అపరేషన్ సక్సెస్ బట్ పేషంట్ డెడ్ అన్న పరస్థితి అంజలీది. అమె నటించిన సినిమాలు బాక్సీఫీసు వద్ద కలెక్షన్లను రాబట్టినా.. అంజలికి మాత్రం సినిమా ఆపర్లు దక్కలేదు.

ఇక అమ్మడు తెరమరుగవ్వడం కాయమనుకున్న సమయంలో కాలీవుడ్ నుంచి కాల్స్ వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు వరుస సినిమా అపర్లు అమెను చుట్టుముట్టడంతో అమె ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. ముందుగా అప్పాటక్కర్ చిత్రంతో కోలీవుడ్‌లో రీ ఎంట్రీ అయి ఇక్కడి వాళ్లను ఆశ్చర్యపరిచారు. జయం రవి సరసన అప్పాటక్కర్ చిత్రంలో నటిస్తుండగానే నటుడు విమల్‌తో మాప్పిళ్లై సింగం చిత్రంలో నటించే అవకాశం అంజలిని వెతుక్కుంటూ వచ్చింది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
 
ఇలాంటి పరిస్థితిలో ఇరవి అనే చిత్రంలో నటించే లక్కీచాన్స్ అంజలిని వరించింది. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ జిగర్‌తండా చిత్రం తరువాత తెరకెక్కించనున్న తాజా చిత్రం ఇరవి. ఇందులో విజయ్ సేతుపతి, బాబిసింహా, ఎస్‌జే సూర్య నటించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ల కోసం చాలాకాలంగా అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికీ ఒక హీరోయిన్‌గా అంజలిని ఎంపిక చేశారు. మరో ఇద్దరు హీరోయిన్ల కోసం ఎంపిక జరగాల్సి ఉందంటున్నారు యూనిట్ వర్గాలు. త్వరలో సెట్‌పై వెళ్లనున్న ఈ చిత్రాన్ని తిరుకుమరన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మాత సివికుమార్ నిర్మించనున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali  Anjali offers  Anjali latest news  Kollywood  

Other Articles