Trisha | telugu movie | Memu

Trisha latest telugu movie title memu

Trisha Upcoming telugu movie title Memu, Trisha telugu movie title Memu, Trisha in Memu, Trisha next movie memu, Trisha memu movie, Trisha latest news, Trisha movie news, Trisha stills, Trisha latest stills, Trisha

Trisha latest telugu movie title Memu: Trisha latest telugu, tamil movie updates. Trisha, poonam bajwa, ovia act in lead roles. tamil version title bhogi, telugu version title memu.

కన్ఫర్మ్: కొత్త సినిమా టైటిల్ ప్రకటించిన త్రిష

Posted: 03/31/2015 11:11 AM IST
Trisha latest telugu movie title memu

తమిళ సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ త్రిష... తన పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగుతానని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. గతకొద్ది కాలంగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడికి స్టార్ క్రేజ్ పెరుగుతుందే తప్ప... తగ్గడం లేదు. రోజురోజుకి త్రిష అందం, గ్లామర్, చిరునవ్వులో ఎలాంటి మార్పు రాకుండా ఇంకా అందంగా తయారవుతోంది.

గతంలో త్రిష ఓ లేడిఓరియెంటెడ్ సినిమా ఒప్పుకున్న విషయం తెలిసిందే. త్రిష, పూనం బజ్వా, మరో హీరోయిన్ ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఈ చిత్ర షూటింగ్ మధ్యలోని ఆగిపోయిందని వార్తలొచ్చాయి. కానీ ఇపుడు ఈ ప్రాజెక్టు మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

త్రిష, పూనమ్ బాజ్వా, ఓవియాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చెన్నై, హైదరాబాద్ లలో జరుగుతోంది. పాండ్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతోంది. తమిళంలో ఈ చిత్రానికి ‘భోగి’ అనే టైటిల్ ఖరారు చేయగా... తెలుగులో ‘మేము’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా త్రిష తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

త్రిషకు కన్నడంలో మంచి మార్కెట్ వున్నందువల్ల కన్నడలోకి కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం తాను ఒప్పుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే పనిలో పడింది. తెలుగులో ప్రస్తుతం బాలయ్య సరసన ‘లెజెండ్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Poonam bajwa  Ovia  Memu  Bhogi  

Other Articles

Today on Telugu Wishesh