kamal hassan uttama villain press meet | cencor board

Kamal hassan fires on cencor board in uttama villain movie promotion press meet

kamal hassan news, kamal hassan updates, kamal hassan press meet, kamal hassan controversy, kamal hassan movies, uttama villain movie, uttama villain news, uttama villain movie updates, pooja kumar, andrea news, kamal hassan tamil movies, ramesh aravind

kamal hassan fires on cencor board in Uttama Villain Movie Promotion Press meet : Univercel star kamal hassan attack on cencor board in Uttama Villain Movie Promotion Press meet.

సెన్సార్ బోర్డుపై కమల్ హాసన్ ‘సర్టిఫికెట్’

Posted: 03/25/2015 12:35 PM IST
Kamal hassan fires on cencor board in uttama villain movie promotion press meet

సినీ ఇండస్ట్రీలో ఏమైనా పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని లోకనాయకుడు కమల్ హాసన్ తనదైన శైలిలో సూటిగా ప్రశ్నలు సంధిస్తుంటారు. ఆ తరహాలోనే తాజాగా ఆయన సెన్సార్ బోర్డుపై తన మార్క్ స్టైల్ లో దానికి సర్టిఫికెట్ ఇచ్చారు. ‘సెన్సార్ బోర్డు తన పరిధి మరిచిపోయి సినిమాల విషయంలో జోక్యం చేసుకుంటోంది. అది సబబు కాదు’ అంటూ కమల్ వ్యాఖ్యానించారు.

కమల్ హాసన్ హీరోగా తాజాగా నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో బిజీగా వున్న ఆయన.. ఈ క్రమంలోనే సెన్సార్ బోర్డుపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కమల్ మాట్లాడుతూ.. ‘సినిమా ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వటం ఓ కళాకారుడిగా నా బాధ్యత! కానీ సెన్సార్ బోర్డ్ వాళ్ళు.. సినిమావాళ్ళు ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనే విషయాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతోంది. ఇలా ప్రతి విషయంలోనూ బోర్డు జోక్యం చేసుకోవడం నేను ఒప్పుకోను. కళకారులు చెప్పాలనుకుంటున్న విషయాలకు అడ్డుపడుతున్న సెన్సార్ గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇలా చెపుతున్నాను’ అని అన్నారు.

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విషయంలోనే కమల్ కి సెన్సార్ తో ఇబ్బంది అయినట్లు తెలుస్తోంది. అందుకే.. ఆయన బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. ఇదిలావుండగా.. కమల్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ దర్శకత్వం వహించారు. ఇందులో కమల్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్లుగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : kamal hassan  uttama villain  cencor board  pooja kumar  

Other Articles

Today on Telugu Wishesh