Ram gopal varma tweets on nirbyahya issue

ram gopal varma, ram gopal varma twitter, ram gopal varma nirbhaya, ram gopal varma sensational comments, nirbhaya rape incidents, nirbhaya documentary, ram gopal varma on nirbhaya opponent council, ram gopal varma press meet, womens day comments, ml sharma

m l sharma the lawyer looks more dangerous than the rapists ramgopal varma

వాళ్లు రేపిస్టుల కన్నా ప్రమాదకారులు.. ఆర్జీవి

Posted: 03/08/2015 09:00 PM IST
Ram gopal varma tweets on nirbyahya issue

తన మనస్సులో ఏది అనిపించినా.. కొందరిలా దాచుకోకుండా.. మరికోందరిలా అవతలివారి కోసం అలోచించి వదిలేయకుండా.. నిర్మోహమాటంగా ఉన్నది వున్నట్టు మాట్లాడి అప్పడప్పుడూ వివాదాల్లో కూడా చిక్కుకునే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా మరోసారి కామెంట్ చేశాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళా అభిమానులు మన్ననలు పొందారు. అదేంటి ఆయన ట్విట్ చేస్తే సెన్సేషన్ అంటారు.. మన్ననలు కూడా పోందుతారా..? అనుకోకండి.. ఆయన రామ్ గోపాల్ వర్మ.. ద క్రియేటివ్ సెన్సెషన్.. ఆయనకు ఏదైనా సాధ్యం.

మహిళా దినోత్సవం సందర్భంగా అందరిలా.. మహిళలకు శుభాకాంక్షలు తెలపకుండా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనపై స్పందించారు అర్జీవి. మహిళల పట్ల సానుకూలంగా స్పందించారు. పురుషుడిలాగే మహిళలు ఎలా జీవించాలనుకుంటున్నారో అలాంటి స్వేచ్ఛ వారికి కావాలని చెప్పారు. మహిళల స్వేచ్ఛ గురించి తానిన్ని తక్కువ మాటల్లో వర్ణించగలిగినందుకు సంతోషపడుతున్నానని అన్నారు. ఓ మహిళ గురించి మరో మహిళ చేసే ప్రకటన ఎప్పటికీ చాలా అందంగా, గొప్పగా ఉంటుందని,  ఆ విషయాన్ని రాజకీయ నాయకులు, నీతులను గురించి మాట్లాడే పెద్దలు ఓ సారి ఆలోచించాలని చెప్పారు.
 
అదే సమయంలో, ఒక చిత్రం ఎన్నో మాటలు చెప్పగలదని, ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీకి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యాయవాది ఎంఎల్ శర్మ లైంగిక దాడులు చేసేవాళ్ల కన్నా చాలా భయంకరమైనవాడంటూ ఆయన ట్వీట్ చేశారు.  మరోపక్క, పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న చిత్రం జ్యోతిలక్ష్మీ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ బహుమతిలాంటిదని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram gopal varma  nirbhaya documentary  twitter account  womens day comments  ml sharma  

Other Articles