Venkatesh speech at ramanaidu condolence meeting

Venkatesh Speech at RamaNaidu Condolence Meeting, Rana Speech at RamaNaidu Condolence Meeting, Ramanaidu Cremation news, Daggubati Ramanaidu latest news, Daggubati Ramanaidu died, Daggubati Ramanaidu passes away, Daggubati Ramanaidu passed away, Daggubati Ramanaidu death news, Daggubati Ramanaidu latest stills, Daggubati Ramanaidu news, Daggubati Ramanaidu wiki, Daggubati Ramanaidu movies, Daggubati Ramanaidu dead body, Daggubati Ramanaidu dead body stills, Daggubati Ramanaidu

Venkatesh Speech at Ramanaidu Condolence Meeting: Producer Daggubati Ramanaidu recently passed away. Telugu film industry condolence to Ramanaidu.

నా గుండెల్లో ఆయన ఎప్పుడూ వుంటారు: రానా

Posted: 02/21/2015 12:53 PM IST
Venkatesh speech at ramanaidu condolence meeting

ప్రముఖ నిర్మాత, మూవీ మొఘల్ డా. దగ్గుబాటి రామానాయుడు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. రామానాయుడు గారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాల మధ్య జరిపిన విషయం తెలిసిందే.

రామానాయుడు గారికి నివాళులు అర్పిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీ ఓ వేదికను ఏర్పాటు చేసారు. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. అలాగే నాయుడు గారి కుటుంబం నుంచి వెంకటేష్ మరియు రానాలు విచ్చేసారు.

వెంకటేష్ మాట్లాడుతూ... ‘నిజం చెప్పాలంటే... ఆయనకు సినిమా తప్ప ఏది ఇష్టం వుండేది కాదు. ఎందుకంటే ఆయన చివరి రోజుల్లో కూడా సినిమా గురించే ఆలోచించారు. మీరు చూపించిన ప్రేమకు చాలా థ్యాంక్స్. ఆయన కొడుకుగా పుట్టడం నాకు గర్వంగా వుంది’ అని చెప్పుకొచ్చాడు.

రానా మాట్లాడుతూ... ‘చిన్నప్పుడు మాకు కృష్ణుడు, రాముడు ఎలా వుంటారంటే... మాకు సినిమాల్లోని ఆ వేశంలో వున్న ఎన్టీఆర్ గారు, శోభన్ బాబు గారి సినిమాలను చూపించేవారు. కాబట్టి దేవుళ్లంటే సినిమాల్లో వుంటారని అలాగే పెరిగాను. నిజానికి నేనో నాస్తికుడిని... ఎందుకంటే ఆ దేవుడికి ఓ రూపం లేదని... కానీ నాకు ఈరోజు అర్ధమయ్యింది.. దేవుడంటే ఇలాగే(రామానాయుడు) వుంటారని అర్థమయ్యింది’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

అలాగే ‘చిన్నాన్న నాకు ఎప్పటినుంచో రాముడు, హనుమంతుల కథ చెబుతుండేవాడు. మొదట్లో రాముడు ఎక్కడ వుంటాడంటే.. అక్కడెక్కడో వుంటాడని హనుమంతుడు అనుకునే వాడు. పోను పోను.. చివరకు.. రాముడు ఎక్కడుంటాడు అంటే తన గుండెలపై వుంటాడని హనుమంతుడు చూపించారు. నాకు ఈ రాముడు(రామానాయుడు) నా గుండెల్లోనే వుంటారెప్పుడు. అలాగే తాతతో పనిచేసిన ఓ వ్యక్తి నాకు మెయిల్ పంపించాడు. అందులో చివరి అక్షరాలు ‘మీ తాతగారు మీకు మాత్రమే చెందిన వ్యక్తి కాదు... అతను ప్రపంచంలో అందరికి చెందినవాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.’ అని అంటూ చెప్పుకొచ్చాడు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రామానాయుడు ఎంతో కృషి చేసారు. కేవలం నిర్మాతగా, నటుడిగానే కాకుండా ఆయన చేసిన సామాజిక కార్యక్రమాల వల్ల ఆయనకు చాలా మంచి పేరుతో పాటు అవార్డులు, బిరుదులు కూడా లభించాయి. రామానాయడు గారు స్థాపించిన ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్లో... ఆయన సమర్పణలో వచ్చిన చివరి చిత్రం ‘గోపాల గోపాల’.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana  Venkatesh  Speech  RamaNaidu  Condolence  Meeting  news  

Other Articles