Remake rumours clarification producer banlda ganesh

temper movie news, temper hindi remake, sachin joshi news, sachin joshi interview, bandla ganesh news, junior ntr news, kajal agarwal news, director puri jagannath news

sachin joshi temper movie hindi remake rumours clarification producer banlda ganesh : Bollywood Hero Sachin Joshi Clarifies that He is not playing leading role in temper movie hindi remake.

టెంపర్ రీమేక్ లో సచిన్ కాదు.. ఓ పెద్ద హీరోనట!

Posted: 02/19/2015 07:57 PM IST
Remake rumours clarification producer banlda ganesh

ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే! ఇంతటి ఘనవిజయం సాధించడంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ ని బాలీవుడ్ నటుడు సచిన్ జోషి తీసుకున్నట్లుగా కొన్నిరోజుల నుంచి వార్తలొస్తున్నాయి. నిర్మాత బండ్ల గణేష్ కి, సచిన్ మధ్య ఆర్థిక లావాదేవీలతోపాటు సన్నిహిత బంధమున్న నేపథ్యంలో ఆ మూవీ రైట్స్ గణేష్ అతనికే ఇచ్చినట్లు సమాచారం! అంతేకాదు.. హిందీ రీమేక్ సచిన్ హీరోగా నటించనున్నట్లు ప్రచారాలు కూడా వచ్చాయి. కానీ.. అవన్నీ కేవలం ట్రాష్ అంటూ సచిన్ జోషి తేల్చి చెప్పేశాడు.

ఈ విషయమై సచిన్ మాట్లాడుతూ.. ‘‘టెంపర్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న విషయం వాస్తవమే! ఆ మూవీ రైట్స్ కూడా నేనే తీసుకున్నాను. కానీ.. అందులో నేను మాత్రం హీరోగా నటించడం లేదు. ఓ పెద్ద హీరోతో ఆ మూవీని తీయాలని ట్రై చేస్తున్నాను. ఆ చిత్రానికి సరిపోయే హీరో ఎవరో నిర్ణయించుకుని చెబుతాను. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తాను’’ అంటూ స్పష్టం చేశాడు. సచిన్ కి ఇండస్ట్రీలో అంతగా మార్కెట్ లేదు కాబట్టి.. ఆ భారీ చిత్రాన్ని ఓ స్టార్ హీరోతో తీస్తే ఆదాయం బాగా రాబట్టుకోవచ్చనే ఉద్దేశంతో సచిన్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sachin joshi temper rights  producer bandla ganesh  

Other Articles