Samantha ruth prabhu remuneration controversy producers

samantha news, samantha latest news, samantha hot photos, samantha gallery, samantha photo shoot, samantha remuneration, tollywood producers, telugu producers, kollywood producers, samantha twitter, samantha facebook

samantha ruth prabhu remuneration controversy producers : Samantha makes controversial comments on producer who didn't given full remuneration to her.

సమంతకూ తప్పని నిర్మాతల కష్టాలు...?

Posted: 02/19/2015 06:14 PM IST
Samantha ruth prabhu remuneration controversy producers

ఏదైనా ఒక చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకోవాలంటే ముందుగా నిర్మాతను మెస్మరైజ్ చేయాల్సి వుంటుంది. అతడు చెప్పినట్లుగానే నడుచుకుంటూ, రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అలా చేయకపోతే.. వాళ్లు తమదైన రీతిలో ఇబ్బందులకు గురిచేస్తుంటారు. సౌకర్యాలు సమకూర్చకపోవడం, రెమ్యునరేషన్ సమయానికి ఇవ్వకపోవడం లాంటివి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యే ఇప్పుడు గ్లామర్ డాల్ సమంతకి వచ్చిందని సమాచారం!

నిజానికి స్టార్ హీరోయిన్లందరూ తమ పారితోషికాలను సినిమా షూటింగ్ నేపథ్యంలోనే తీసేసుకుంటారు. అలా కాని ఎడల మూవీలో నటించేందుకు వారు అంతగా ఆసక్తి చూపరు! డేట్స్ కుదరడం లేదంటూ తమ చుట్టూ తిప్పుకోవడం చేస్తారు. అందుకే.. నిర్మాతలు కూడా ముందుగానే తారలకు డబ్బులు ఇచ్చేసి, వారిని తమ సినిమాకోసం బుక్ చేసుకుంటారు. అంటే.. తారలు ఎలాగైనా తమ పారితోషికాన్ని ముక్కుపిండిమరీ వసూలు చేస్తారు. కానీ.. ఇక్కడో నిర్మాత మాత్రం సమంతాకి ఇస్తానన్న పారితోషికం మొత్తం ఇవ్వకుండా మధ్యలోనే కటింగ్ పెట్టాడట! ఇదే విషయమై సమంతా కూడా వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

‘మా పని మేము సవ్యంగా చేశాక, మాట్లాడుకున్న మొత్తం ఇవ్వకుండా ఎందుకు కటింగ్ పెడతారు? అలా చేస్తే తిరిగి అలాంటి బ్యానర్లకు మళ్లీ చేయాలనిపించదు కదా..?’’ అంటూ ఈ బొద్దుగుమ్మ వాపోతోంది. అంటే.. తనకు ఎవరో నిర్మాత పూర్తిగా పారితోషికం ఇవ్వకుండా మధ్యలోనే ఆపేసిందని పేర్కొంటోందన్నమాట! అయితే.. ఆ నిర్మాత ఎవరన్నది విషయం మాత్రం చెప్పలేం! ఏదైతేనేం.. చివరికి సమంతాకి కూడా నిర్మాతల కష్టం తప్పడం లేదన్నమాట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha ruth prabhu  heroines remunerations  telugu producers  

Other Articles