Sanjana kannada actress limca book of world records 104 hours cycling

sanjjana latest news, kannada actress sanjana news, kannada actress sanjana cycling, limca book of world records, sanjjana limca book, sanjana limca book news

sanjana kannada actress limca book of world records 104 hours cycling : The kannada actress got chance in limca book of world record because she shows her talent with cycling.

104 గంటలు పోరాడి చివరికి బుక్కయ్యింది!

Posted: 02/18/2015 02:11 PM IST
Sanjana kannada actress limca book of world records 104 hours cycling

హాట్ సినిమాల్లో నటించి సెక్సీ తారగా పేరొందిన సంజన... ఓ అరుదైన ఘనతను సాధించింది. ఇండస్ట్రీలో ఏ తార ఇదివరకెన్నడూ చేయలేని సాహసాన్ని ఈమె చేసి తన సత్తా ఏంటో నిరూపించుకుంది. తోటి తారలతోపాటు మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 104 గంటలు పోరాడి రికార్డు సృష్టించింది ఈ భామ!

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే నిర్వహించిన ఓ సైక్లింగ్ కాంపిటీషన్ లో కన్నడ నటి సంజన పాల్గొంది. ఈ పోటీ నేపథ్యంలో ఎవరు ఎంత ఎక్కువసేపు సైకిల్ తొక్కుతారో వారికి అరుదైన బహుమతి లభిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఈ అమ్మడు ఇందులో పాలుపంచుకోవాలని ఆసక్తి కనబరిచింది. ఓ సైక్లింగ్ గ్రూప్ తో కలిసి ఈమె ఈ సవాల్ ని స్వీకరించారు. అంతే! ఈ పోటీలో తన సత్తా ఏంటో చూపిస్తూ.. ఏకంగా 104 గంటలు నిరవధికంగా సైకిల్ తొక్కి అందిరినీ ఆశ్చర్యపరిచింది.

ఈమె కనబరిచిన ఈ సాహసానికిగాను ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించుకుంది. ఇంకో విషయం ఏమిటంటే.. అందులో స్థానం సంపాదించుకోవడం కోసమే సంజన ఈ పోటీల్లో పాల్గొందట! అదీ.. సంకల్పం అంటే! అనుకుంది.. సాధించింది. ఈ రికార్డుతో ఇప్పుడు సంజన టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kannada actress sanjjana  limca book of world records  

Other Articles