Junior ntr sukumar rakul preet singh bvsn prasad latest movie updates

junior ntr latest news, junior ntr sukumar movie news, sukumar movie, rakul preet singh news, rakul preet singh hot photos, junior ntr rakul preet, bvsn prasad news

junior ntr sukumar rakul preet singh bvsn prasad latest movie updates : Junior ntr latest movie updates which is directed by sukumar. In this movie rakul preet is pairing with ntr.

ఎన్టీఆర్ ముందుగానే ఫిక్స్ అయిపోయాడు?

Posted: 02/18/2015 02:32 PM IST
Junior ntr sukumar rakul preet singh bvsn prasad latest movie updates

‘టెంపర్’ హిట్ తో ఫుల్ జోష్ మీదున్న జూనియర్ ఎన్టీఆర్.. అప్పుడే తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడే ఆ మూవీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఇంకా షూటింగ్ మొదలవ్వకముందే విడుదల తేదీని కూడా ఖరారు చేసి పడేశారు. మరిన్ని వివరాలను కూడా తెలియపరిచారు.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ వచ్చేనెల 3వ తేదీ నుంచి హైదరాబాదులో ప్రారంభం కానుందని సమాచారం! అప్పటినుంచి రెగ్యులర్ గా నవంబర్ నెలాఖరు వరకు షూటింగ్ జరుపుతారు. అనంతరం నిర్మాణ కార్యక్రమాలను త్వరగా ముగించేసే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే.. ఏ తేదీన రిలీజ్ చేస్తారోనన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇంకో విషయం ఏమిటంటే.. ఇది ఎన్టీఆర్ కు 25వ చిత్రం. అందుకే.. పలు ప్రత్యేకతలతో దీనిని భారీగా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఫిక్స్ అయ్యింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంకా తదితర నటీనటుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr sukumar movie  bvsn prasad  rakul preet singh  

Other Articles