Pawan kalyan gabbar singh 2 movie shooting march 20 hyderabad anisha ambrose

pawan kalyan news, pawan kalyan gabbar singh 2 movie, gabbar singh 2 movie updates, gabbar singh 2 movie shooting, gabbar singh movie news, pawan kalyan latest news, pawan kalyan movies, anisha ambrose news, anisha ambrose latest news

pawan kalyan gabbar singh 2 movie shooting march 20 hyderabad anisha ambrose : pawan kalyan gabbar singh 2 movie regular shooting starts from march 20 in hyderabad. In this movie anisha ambrose selected as heroine.

ఎట్టకేలకు పవర్ గన్ ‘ఫైర్’ అయ్యిందోచ్!

Posted: 02/18/2015 01:55 PM IST
Pawan kalyan gabbar singh 2 movie shooting march 20 hyderabad anisha ambrose

ఎప్పుడో భూమి పుట్టినప్పుడు స్టార్ట్ అవుతుందనుకున్న ‘గబ్బర్ సింగ్ 2’ మూవీ ప్రాజెక్టు.. వాయిదా పడుతూనే వస్తోంది. ఆమధ్య పవర్ స్టార్ పవన్ కల్యాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ చిత్రానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే! ఆ తరువాతనైనా ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు కానీ స్ర్కిప్ట్ రెడీ కాకపోవడంతో దాన్ని పెండింగ్ లో పెట్టేశారు. ఆ సమయంలోనే పవన్ ‘గోపాల గోపాల’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అది కూడా వచ్చి వెళ్లిపోయింది కానీ.. ‘గబ్బర్’ సంగతి మాత్రం బయటికి రాలేదు. అయితే.. ఇన్నాళ్లకు ఆ మూవీకి సంబంధించి ఓ వార్త వెలువడింది. ‘గబ్బర్ సింగ్ 2’ చిత్రం షూటింగుకు షెడ్యూల్స్ ఫనల్ చేస్తున్నారు.

మార్చి 20వ తేదీ నుంచి ఈ మూవీ షూటింగును హైదరాబాద్ లో రెగ్యులర్ గా నిర్వహిస్తారని సమాచారం! ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ప్రస్తుతం జోరుగా కొనసాగుతున్నాయి. గతంలో పవన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ భారీ హిట్ కావడంతో ‘గబ్బర్ సింగ్ 2’ పేరిట మరో చిత్రాన్ని నిర్మించడానికి ఉపక్రమించారు. అయితే.. ఈ మూవీ మొదటి చిత్రానికి ఏమాత్రం సీక్వెల్ కాదని చిత్రనిర్మాత శరత్ మరార్ చెబుతున్నారు. ఇక ఈ చిత్రానికి ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పుడే ఈ సినిమాలో ఓ కథానాయికగా విశాఖ అమ్మాయి అనీషా ఆంబ్రోస్ ఖరారు కాగా.. మరో హీరోయిన్ కోసం బాలీవుడ్ తారను ఎంపిక చేస్తున్నారని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pawan kalyan gabbar singh 2  anisha ambrose news  

Other Articles