Anjali lawyer getup mappillai singam tamil movie news

anjali latest news, anjali lawyer getup, anjali lawyer controversy, anjali gossips, anjali hot photos, anjali tamil movies, anjali controversies, director rajasekhar, hero vimal news, mappillai singam movie, mappillai singam movie updates

anjali lawyer getup mappillai singam tamil movie news : telugu actress anjali to play lawyer character role in mappillai singam movie in which she is pairing with young hero vimal and directed by rajasekhar.

లాయర్లకు సవాల్ విసురుతున్న అంజలి..

Posted: 02/18/2015 12:58 PM IST
Anjali lawyer getup mappillai singam tamil movie news

తెలుగు, తమిళ భాషారంగంలో పలుచిత్రాల్లో హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న అంజలి.. ఇప్పుడు తమిళనాటలో లాయర్లకు సవాల్ విసురుతోందని సమాచారం! జరుగుతున్న అన్యాయాలను చూస్తూ సహించకలేకపోయిన ఈ అమ్మడు.. చేసేదేమీలేక ఏకంగా రంగంలోకి దిగిందట! అవినీతి మార్గాన్ని ఎంచుకున్న లాయర్లకు సవాల్ విసురుతూ వారికి వ్యతిరేకంగా వాదించేందుకు సిద్ధమవుతోంది! అయితే.. ఇదంతా రియల్ లైఫ్ లో కాదులెండి, రీల్ లైఫ్ లో!

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నటి అంజలి.. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కుతున్న ‘మాపిళ్ళయ్ సింగం’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీకోసం ఈమె తన గెటప్ ను పూర్తిగా మార్చేసి, న్యాయవాదిగా అవతారం ఎత్తింది. గ్రామీణ వాతావరణంలో సాగే ఈ కథాచిత్రంలో అంజలి లాయర్ అవతారమెత్తిందని మూవీ యూనిట్ బృందం తెలుపుతోంది. నల్లకోటు వేసుకుని కోర్టులో ఆమె చేసే వాదనలకు సంబంధించిన సన్నివేశాలు ఎంతో అద్భుతంగా వుంటాయని అంటున్నారు. గత చిత్రాలలో అంజలి నటించిన పాత్రలతో పోల్చుకుంటే ఇందులో అంజలి ఎంతో అనూహ్యంగా నటించిందని యూనిట్ వర్గాలు ఆమెను ప్రశంసిస్తున్నాయి.

రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యువనటుడు విమల్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఆడియో, మూవీ రిలీజ్ డేట్ ని వెల్లడిస్తారు. మరోవైపు ఈ సినిమా తనకు మంచి గుర్తింపు తెస్తుందని, తన పాత్రకు బాగానే మార్కులు పడతాయని అంజలి ఆశలు పెట్టుకుందట! పైగా.. కోల్పోయిన తన పాత ఇమేజ్ తిరిగి వస్తుందని అమ్మడు భావిస్తోందట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anjali lawyer getup  mappillai singam movie updates  tamil hero vimal news  

Other Articles