Dasari narayana rao compliment to puri jagannadh

Dasari narayana rao compliment to Puri Jagannadh, Dasari narayana rao compliment to Puri Jagannadh, Dasari narayana rao compliment on temper, Ntr Temper, Puri jagannadh Temper, Puri jagannadh Temper movie news, Puri jagannadh Temper collections, Puri jagannadh Temper songs, Puri jagannadh Temper trailers

Dasari narayana rao compliment to Puri Jagannadh: Puri jagannadh got biggest compliments from director Dasari narayana rao for Temper movie. ntr, kajal in lead roles, bandla ganesh producer.

టెంపర్ తో దాసరికి వారసుడు దొరికేసాడు

Posted: 02/17/2015 11:10 AM IST
Dasari narayana rao compliment to puri jagannadh

పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘ఆంధ్రావాలా’ అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమానే రాలేదు. 10 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘టెంపర్’.

ఎన్టీఆర్, పూరీ కాంబినేషన్లో రూపొందిన ఈ ‘టెంపర్’ ఇటీవలే విడుదలై దుమ్మురేపుతోంది. హిట్ టాక్ తో భారీ కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా ఇచ్చిన కిక్కు కంటే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇచ్చిన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేనని అంటున్నాడు దర్శకుడు పూరీ జగన్నాధ్.

‘టెంపర్’ సినిమాను తాజాగా దాసరి నారాయణరావు చూసారట. ఈ సినిమా చూసిన తర్వాత ‘నా వారసుడివి నువ్వే’ అని అంటూ పూరీని దాసరి నారాయణ రావు ప్రశంసించాడట. ఈ విషయాన్ని స్వయంగా పూరీయే ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

After watching TEMPER "నా వారసుడివి నువ్వే" - దాసరి నారాయణరావు. This is da biggest compliment in my life, and it's much much bigger than da success I Hav ever achieved. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

మరి ఈ వారసత్వం ఎన్నిరోజుల వరకు వుంటుందో చూడాలి. ప్రస్తుతం ‘టెంపర్’కు భారీ క్రేజ్ ఏర్పడటంతో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర సినీ ఇండస్ట్రీల దర్శకనిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ ‘టెంపర్’ నిర్మాత బండ్ల గణేష్ మాత్రం తానే అన్ని భాషలలో రీమేక్ చేస్తానని చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari narayana rao  compliment  Puri jagannadh  Temper  NTR  Bandla ganesh  movies  news  telugu  

Other Articles