Varun tej regina cassandra southscope magazine new edition photo shoot

varun tej regina cassandra southscope magazine new edition photo shoot : Southscope magazine has take the new photo shoot with varun tej and regina in which their chemistry is superb.

హవ్వా! అడ్డంగా దొరికిన మెగా యువజంట!

Posted: 02/12/2015 11:15 AM IST
Varun tej regina cassandra southscope magazine new edition photo shoot

ఇటీవలే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఓ యువజంట ప్రేమాయణం నడుపుతూ అడ్డంగా దొరికిపోయింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీతోనే సక్సెస్ అందుకున్న ఆ జంట చేతిలో మరిన్ని ఆఫర్స్ వుండగానే అప్పుడే ప్రేమలో మునిగితేలుతున్నారని చెప్పుకుంటున్నారు. నిజానికి ఆ ఇద్దరూ కలిసి ఇంతవరకూ ఒక్క మూవీ కూడా చేయలేదు. వ్యక్తిగతంగా అంతగా పరిచయం కూడా లేదు. అయితే.. వున్నట్లుండి ఇద్దరూ ఓ రెస్టారెంట్’లో అడ్డంగా దొరికిపోయారు. ఇంతకూ వారెవరనుకుంటున్నారా... మెగాహీరో వరుణ్ తేజ్ - రెజీనా! అయితే వీరిది రియల్ లవ్ స్టోరీ కాదులెండి.. ‘ఫోటోషూట్’ లవ్ స్టోరీ!

వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ‘ముకుందా’తో హిట్ కొట్టిన విషయం తెలిసిందే! ఇక రెజీనా వరుస విజయాలతో నటిగా తనేంటో నిరూపించుకుంది. ప్రస్తుతం ఇద్దరి కెరీర్ ఫుల్ స్వింగ్’లో వుంది. పైగా ఇద్దరూ బాగా పాపులర్ అయిన సెలబ్రిటీస్ కాబట్టి.. ఈ జంటతో ప్రచారం చేయించుకోవాలని ఓ మేగజైన్ ఫోటోషూట్ నిర్వహించింది. ‘సౌత్ స్కోప్’ మేగజైన్ తన లేటెస్ట్ ఎడిషన్స్ కోసం అప్పుడప్పుడు పాపులర్ తారలతో ఫోటోషూట్ నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే ఈసారి వరుణ్-రెజీనాతో ఓ ఫోటోషూట్ నిర్వహించింది. అందులో వీరిద్దరి కెమెస్ట్రీ బాగా కుదిరిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇందులో భాగంగానే విడుదలైన ఓ ఫోటోలో వీరిద్దరి కెమెస్ట్రీని గమనించవచ్చు.

regina-varun-photo-shoot

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రెజీనా.. ఈమధ్య మెగాహీరోల సరసనే ఎక్కువగా కనిపిస్తోంది. చరణ్, పవన్ మినహా మిగతా మెగాయువహీరోలతోనూ ఈ అమ్మడు మూవీలు, యాడ్స్ చేస్తూ తన ఇమేజ్’ని పెంచుకుంటోంది. ఇక ఆ ఇద్దరి హీరోలతోనూ ఈ భామ ఒక్కొక్క మూవీ చేస్తే.. ఈమెకిక తిరిగే వుండదు. అన్నట్లు ఇప్పటికే ఈ డస్కీ బ్యూటీకి ‘మెగా హీరోయిన్’ అనే ముద్ర కూడా పడిపోయింది! ఇక వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా..? అని వెయిట్ చేస్తున్నాడు! ఏదైతేనేం.. తాజా ఫోటోషూట్’తో ఈ జంట టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచిపోయారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles