Dhanush mariyaan movie telugu teaser released

dhanush mariyaan movie telugu teaser, mariyaan telugu teaser, Dhanush's Mariyaan Movie First Look Trailer, Dhanush's Mariyaan Movie Trailer Download, Downlaod Dhanush's Mariyaan Movie Trailer, Download Mariyaan Movie Trailer, Mariyaan Movie Trailer, Dhanush

dhanush mariyaan movie telugu teaser released: Dhanush Mariyaan tamil movie dubbing in telugu. title maryan. ar rehaman music.

ధనుష్ మరియన్ ట్రైలర్ విడుదల

Posted: 02/12/2015 10:34 AM IST
Dhanush mariyaan movie telugu teaser released

ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బిటెక్’ సినిమా తెలుగులో ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ధనుష్ నటించిన తమిళ చిత్రాలన్ని కూడా తెలుగులోకి డబ్బింగ్ అయ్యే పనిలో పడ్డాయి. ఒక్కొక్క సినిమా తెలుగులోకి డబ్బింగ్ అవుతున్నాయి. తెలుగులో కూడా ధనుష్ మార్కెట్ పెంచుకోబోతున్నాడు.

ఇటీవలే ‘పందెంకోళ్లు’ సినిమాతో వచ్చిన ధనుష్ ఇపుడు ‘అనేకుడు’ గా రాబోతున్నాడు. దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న తమిళ ‘అనేగన్’ చిత్రాన్ని తెలుగులో ‘అనేకుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే గతంలో ధనుష్ నటించిన విభిన్న తమిళ కథా చిత్రం ‘మరియన్’. తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇపుడు ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. నిన్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్ విడుదల చేసారు.

యస్.వి.ఆర్ మీడియా ప్రై లిమిటెడ్ సమర్పణలో భరత్ బాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సి.జె. శోభ తెలుగులో అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. త్వరలోనే ఆడియో విడుదల చేసి వేసవి సెలవుల్లో సినిమా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  mariyaan  teaser  telugu  news  movies  

Other Articles