Neetu chandra dual role tamil movie offer director shaji kailas kollywood

neetu chandra news, neetu chandra latest gossips, neetu chandra hot photos, neetu chadra tamil movie, neetu chandra dual role, neetu chandra gallery, neetu chandra twitter, neetu chandra hot pics, neetu chandra photo shoot, neet chandra hot scenes, director shaji kailas, tollywood gossips, telugu movie news, telugu websites

neetu chandra dual role tamil movie offer director shaji kailas kollywood : Neetu chandra got huge offer from tamil director shaji kailas. In this movie she is playing dual role.

అరకొర ఆఫర్లున్న అమ్మడు బాగానే వేషాలేస్తోంది..?

Posted: 02/12/2015 12:31 PM IST
Neetu chandra dual role tamil movie offer director shaji kailas kollywood

‘విష్ణు’ మూవీతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నీతూచంద్ర.. ‘గోదావరి’ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆ తర్వాత ఈమెకు తెలుగులో మరే ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్’లలో అరకొర సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతోంది. ఓవైపు మూవీ ఆఫర్లు కోసం బాగానే తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో ఈమెకు కోలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అంతే! ఈ ఆఫర్ వచ్చిందో.. లేదో.. అమ్మడికి హద్దులే లేకుండా పోయాయి. నిన్నమొన్నటివరకు కేవలం అరకొర ఆఫర్లతో సతమతమవుతున్న ఈ అమ్మడికి పిలిచిమరీ ఆఫర్ ఇస్తే.. ఇప్పుడు వేషాలేస్తోందని కోలీవుడ్ సమాచారం!

అసలు విషయం ఏమిటంటే.. తమిళంలో అందివస్తున్న చిన్నచిన్న పాత్రలను వదులుకోకుండా నీతూచంద్ర నటిస్తూ వస్తోంది. ఆయా సీన్లలో తన అందాలను ఆరబోస్తూ హాట్’గా ప్రేక్షకులను వేడెక్కించేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ ఈమెకు తన సినిమాలో నటించే భారీ ఆఫర్ ఇచ్చాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో అమ్మడు డబుల్ రోల్ వేస్తోంది. అంటే.. రెండు వేషాల్లో చిందులేయనుందన్నమాట! నిన్నటివరకు హీరోయిన్’గా అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్న ఈ అమ్మడికి.. ఆ తమిళ దర్శకుడు ఏకంగా డబుల్ రోల్ ప్రధాన పాత్రల్లో నటించే అవకాశం ఇవ్వడంతో.. నీతూ ఆనందంతో పొంగిపోతోంది. పైగా.. తనకు ఈ విధంగా ఆఫర్ వచ్చినట్లు సంతోషంగా ధ్రువీకరిస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతుందని స్పష్టం చేసింది!

‘‘కెరీర్లో మొదటిసారిగా ద్విపాత్రాభినయం చిత్రం చేస్తున్నాను. ఇది నాకు ఓ కొత్త అనుభవం అవుతుంది. కెరీర్ కి ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ప్రస్తుతం షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంతో నేనూ ఎదురుచూస్తున్నాను. సినిమా గురించి పెద్దగా చెప్పలేను గానీ.. ఓ మ్యూజికల్ థ్రిల్లర్ అని మాత్రం చెప్పగలను’’ అంటూ ట్వీట్ చేసింది నీతూ! ఈ మూవీ షూటింగ్ ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మూవీపై నీతూ చంద్ర భారీగా అంచనాలు పెట్టుకుంది. ఈ మూవీతో తమిళంలో తన కెరీర్ మలుపుతిరుగుతుందనే నమ్మకంతో వుంది. మరి.. ఆమె నమ్మకాన్ని మూవీ నిలబెడుతుందో..? లేదో..? చూడాలి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles