Director teja new movie shooting at agumbe forest

Director teja Movie Shooting at agumbe forest, Director teja Shooting at agumbe forest, Director teja at agumbe forest, Director teja Shooting at agumbe, Teja Movie Shooting at agumbe forest, Director teja latest news, Director teja movie news, Director teja latest updates, Director teja latest movie shooting, Director teja

Director teja Movie Shooting at agumbe forest: Director Teja New Movie Shooting at Agumbe Forest. This untitled film will have all new comers playing important roles.

అగుంబే కోబ్రాల మధ్య తేజ కొత్త సినిమా

Posted: 02/12/2015 09:56 AM IST
Director teja new movie shooting at agumbe forest

గత వరుస చిత్రాలతో సతమతమవుతున్న దర్శకుడు తేజ మళ్లీ ఓ కొత్త సినిమాతో సిద్ధమవుతున్నాడు. ఒకప్పుడు ‘చిత్రం’సినిమాతో దర్శకుడిగా వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తేజకు గతకొద్ది ఏళ్లుగా హిట్లులేక తేజకు వున్న క్రేజ్ భారీగా తగ్గిపోయింది. ఇటీవలే సాయిరాంశంకర్ తో ‘1000 అబద్ధాలు’ అనే సినిమా తీసాడు. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

ఈ సినిమా విడుదలై దాదాపు ఏడాది గడుస్తున్నా కూడా ఇంకా తేజ తన కొత్త సినిమా మొదలుపెట్టలేదు. అయితే తాజాగా తేజ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈసారి ఫారెస్ట్ ను టార్గెట్ చేసాడు. త్వరలోనే షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.

కర్ణాటకలోని ‘అగుంబే’ అనే భయంకరమైన అటవీ ప్రాంతంలో నెలరోజుల పాటు షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో కొండలలో ఎప్పుడూ వర్షం కురుస్తూ వుంటుంది. అలాగే రకరకాల కోబ్రాలు సంచరిస్తుంటాయని... అక్కడ కోబ్రాలపై పరిశోధన జరిపే కేంద్రం కూడా స్థాపించారు.

మరి అలాంటి స్థానంలో తేజ ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నాడో ఏమో కానీ... తేజ మాత్రం తన కథకు అదే ప్రదేశమే సరిపోతుందని ఫిక్స్ అయ్యారని, అందుకు తగిన జాగ్రత్తలన్నీ తీసుకుని వెళ్తున్నామని చిత్ర యూనిట్ చెబుతున్నారు. మరి తేజ తీయబోయే ఈ సినిమా ఎలా వుండబోతుందో ఏమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Director teja  Shooting  Agumbe  Forest  Karnataka  telugu  news  

Other Articles