Kamal denies pk rumor

legendary actor Kamal Haasan, kamal denies pk rumor, kamal quashing all the rumors of PK, kamal denies acting in Tamil remake PK, Kamal Haasan movie collections, Kamal Haasan hits, Kamal Haasan latest updates, Kamal Haasan latest news, Kamal Haasan upcomming movies, Kamal Haasan forth comming movies

legendary actor Kamal Haasan quashing all the rumors, of acting in the Tamil remake of the Hindi hit film PK.

అవన్నీ వట్టి పుకార్లే.. వాటిని నమ్మకండి

Posted: 02/11/2015 10:09 AM IST
Kamal denies pk rumor

అవన్నీ వట్టి వదంతులేనని, ఎవరో సృష్టించిన పుకార్లేనని, వాటిని నమ్మవద్దని తమిళనాట నట దిగ్గజం కమల్ హాసన్ అన్నారు. గతకొన్ని రోజులుగా హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘పి.కె’ చిత్రాన్ని తమిళంలో రిమేక్ చెయ్యనున్నారని, దాంట్లో కమల్ హాసన్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పుకార్లు ఎట్టకేలకు కమల్ కు చేరడంతో ఆయన స్పందించారు. ఈ వార్తలను ఖండిస్తూ కమల్ తాను ఎటువంటి రీమేక్ లను చేసే ఉద్దేశంలో లేడని తెలిపాడు. వాటిని నమ్మవద్దని తన అభిమానులను కోరారు.

అయితే ఈ సందర్భంగా కమల్ తన అభిమానులకు మంచి శుభవార్తను అందించారు. అతి అరుదుగా కమల్ చిత్రాలను విడుదలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మూడు చిత్రాలు విడుదలవుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం తాను మూడు చిత్రాలలో నటిస్తున్నట్లు చెప్పిన ఆయన మూడు చిత్రాలకు కూడా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులలో వున్నాయని తెలిపారు. ముందుగా ఈ మూడు చిత్రాలు విడుదలైన తరువాతే వేరే చిత్రాల గురించి ఆలోచిస్తానని కమల్ హాసన్ తెలిపాడు. ఈ ఏడాదిలో ఒకదానివెంట మరొకటి కమల్  మూడు చిత్రాలు విడుదలకానుండడంతో కమల్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kamal hassan  kolly wood news  pk  

Other Articles