Anchor anasuya movie offer nagarjuna soggade chinni nayana kalyan krishna director

anchor anasuya, anasuya latest news, anasuya hot photo shoot, anasuya gallery, anasuya nagarjuna movie, anasuya hot photo shoot, anasuya photos, anasuya latest updates, anasuya soggade chinni nayana movie, soggade chinni nayana movie updates, anasuya adavi sesh movie

anchor anasuya movie offer nagarjuna soggade chinni nayana kalyan krishna director : the hottest tv anchor anasuya got bumper offer in nagarjuna movie. She is acting as sister-in-law beside nag in soggade chinni nayana movie.

నాగార్జునతో అనసూయ సరసాలు.. ఏమిటీ కథ?

Posted: 01/21/2015 10:10 AM IST
Anchor anasuya movie offer nagarjuna soggade chinni nayana kalyan krishna director

తన సెక్సీ లుక్స్’తో, చిన్న చిన్న డ్రెస్సులు ధరిస్తూ, సెక్స్ అప్పీల్ కనిపించేలా ఎక్స్’ప్రెషన్స్’తో ప్రేక్షకులను కట్టిపడేసి బుల్లితెర హాట్ యాంకర్’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ! ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా భారీ పాపులారిటీని మూటగట్టుకున్న అమ్మడు.. టాలీవుడ్ గ్రీకువీరుడిగా పేరొందిన నాగార్జునతో కలిసి సరసాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలొస్తున్నాయి. అతనితో కలిసి చిలిపిచేష్టలు చేయడం మాత్రమే కాకుండా.. డ్యూయెట్ చేస్తూ ఎంజాయ్ చేయబోతోందని అంటున్నారు. అసలు కథేంటీ..? అనుకుంటున్నారా..? అయితే మేటర్’లోకి వెళ్లాల్సిందే!

నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ఓ చిత్రాన్ని చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం విదితమే! నాగ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రానికి ‘సోగ్గాడే చిన్ని నాయన’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో సెక్సీ యాంకర్ అనసూయకు ఓ కీలకపాత్రలో నటించే బంపరాఫర్ వచ్చింది. ఇందులో అమ్మడు నాగార్జున మరదలుగా నటిస్తుందని సమాచారం! అంతేకాదు.. వీరిమధ్య మాంచి చిలిపి సన్నివేశాలతో వుండటంతోపాటు ఓ డ్యూయెట్ కూడా వుంటుందని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ పాత్రతో అమ్మడి వ్యాల్యూ మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. గతంలో అనసూయకు కొన్ని ఆఫర్లు వచ్చిన విషయం తెలిసిందే! ‘అత్తారింటికి దారేది’లో ఐటమ్ సాంగ్ ఆఫర్ రాగా.. తాను మాత్రం మంచి పాత్రలో నటించాలనే ఉద్దేశంతో దాన్ని తిరస్కరించింది. అనంతరం అంతగా ఆఫర్లు రాకపోవడంతో తన యాంకరింగ్ వేగాన్ని పెంచడంతోపాటు గ్లామర్, సెక్సీ లుక్స్’ని రెట్టింపు చేసుకుంది. అందుకే.. మళ్లీ ఆఫర్లు ఈమె చెంతకు చేరుతున్నాయి. ఇప్పటికే ఈ భామ అడవి శేష సరసన ‘క్షణం’ అనే చిత్రంలో కథానాయికగా నటించే ఆఫర్ దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా నాగార్జున సరసన మరదలుగా బంపరాఫర్ కొట్టేసింది. ఇలాగే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తే.. ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సాధించడం ఖాయమని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor anasuya news  soggade chinni nayana movie  akkineni nagarjuna latest  

Other Articles