Anjali demands high remuneration for item song in charans movie

anjali latest news, actress anjali latest news, actress anjali hot photos, actress anjali gossips, actress anjali photo shoot, actress anjali photo gallery, actress anjali remuneration, anjali charan movie, anjali srinu vaitla news, anjali charan news

anjali demands high remuneration for item song in charans movie : telugu actress anjali demanding high remuneration for item song in charan's movie which is directed by srinu vaitla.

ఓరి దేవుడా..! ‘ఐటమ్’కి రూ.కోటా..?

Posted: 01/20/2015 06:49 PM IST
Anjali demands high remuneration for item song in charans movie

టాలీవుడ్ ‘సీతమ్మ’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తెలుగు నటి అంజలి.. అప్పట్లో కొన్ని కుటుంబతగాధాల వల్ల కొన్నాళ్లపాటు ఇండస్ట్రీ దూరమైన సంగతి తెలిసిందే! దాని ప్రభావం ఇప్పుడు అంజలి కెరీర్ తీవ్రంగా పడింది. ఆ దెబ్బతో ఆమెకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. అందుకే.. వచ్చిన చిన్నాచితకా ఆఫర్లు వదులుకోకుండా తక్కువ రెమ్యునరేషన్లకే నటించేస్తోంది. ఇంతలోనే ఓ దర్శకుడు ఈమెకు ‘ఐటమ్ సాంగ్’ ఆఫర్ ఇవ్వబోగా.. అమ్మడు కొన్ని కండిషన్లు పెట్టింది. అయితే సదరు దర్శకుడు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన అంజలి.. అతని దిమ్మతిరిగిపోయేలా కోటి రూపాయలు డిమాండ్ చేసిందట! దాంతో ఆ మూవీ యూనిట్ బృందం షాక్’లో మునిగిపోయిందని సమాచారం!

వివరాల్లోకి వెళ్తే.. దర్శకుడు శ్రీనువైట్ల, రామ్ చరణ్ తేజ్ కాంబోలో ‘నా పేరు రాజు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే! యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, ఎంటర్’టైన్మెంట్ ఎలిమెంట్స్’తో ఈ మూవీని రూపొందిస్తున్న శ్రీను.. ఇందులో ఓ స్పెషల్ సాంగ్’ని ప్లాన్ చేశాడు. అందుకు ఫ్యామిలీ ఆడియెన్స్’కు తగ్గట్టుగా వుండే తారను ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో అతగాడు అంజలిని సంప్రదించాడట! మెగాహీరోతోబాటు సక్సెస్’ఫుల్ ఫ్యామిలీ డైరెక్టర్’ కాంబోలో వస్తున్న మూవీ కాబట్టి అందుకు వెంటనే గ్రీన్ ఇచ్చేసింది. అయితే వచ్చిన సదావకాశాన్ని అదునుగా మార్చుకోవాలని భావించిన ఈ అమ్మడు.. ఐటమ్’సాంగ్’తో పాటు కొన్ని షరతులను కూడా అమ్మడు విధించిందట!

అదేమిటంటే.. స్పెషల్ సాంగ్’తోబాటు తనకు, చరణ్’కు లింక్ చేస్తూ కొన్ని సీన్స్ చేయాలని కోరిందట! అయితే మూవీ స్ర్కిప్ట్ ప్రకారం అందుకు శ్రీనువైట్ల ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన అంజలి.. తాను చేసే స్పెషల్ సాంగ్’కి కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట! అంతకంటే రూపాయి తక్కువ ఇచ్చిన చేసేది లేదని తేల్చి చెప్పిన అమ్మడు.. ఇష్టం వుంటే చేయించుకోండి లేకపోతే లేదు అన్నట్లుగా సమాధానం ఇచ్చిందట! అంజలి ఈ విధంగా ఇచ్చిన సమాధానాన్ని చూసి శ్రీనువైట్లతోబాటు చరణ్ కూడా షాక్’లో మునిగిపోయాడట! అసలు ఎందుకిలా అంజలి వ్యవహరిస్తుందోనంటూ ఇద్దరూ డైలామాలో మునిగిపోయారని సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles