Temper movie pre release talk

Temper movie, Temper movie updates Temper movie wallpapers, Temper movie photos, Temper movie pre release talk, Temper audio release date, Temper movie cast and crew, ntr latest, ntr photos, jr ntr wallpapers, tollywood updates, upcoming telugu movies, puri jagannath next movie, puri jagannath movies

Temper movie pre release talk : NTR latest movie temper getting good pre release talk from all sides. Nandamuri Hero fans, movie unit and tollywood analysts feels Temper will give a break to NTR and Puri Jagannath. temper movie to release on 5th February 2015 audio launch will be in last week of January

ఇప్పటివరకైతే బాగానే ఉందట.. కానీ......

Posted: 01/17/2015 03:41 PM IST
Temper movie pre release talk

ఈ మద్య సినిమాలు చూడాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. మూవీ రిలీజ్ కు ముందు వస్తున్న టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. దీనికి తోడు ప్రమోషన్లు చూసి ఏదో ఉంటుందని భావించి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తున్నారు. తీరా అక్కడ చూస్తే మాత్రం ఐదారు పాత సినిమాల కథలు కలిపేసి.., కొత్త హీరోలతో తీయించి విడుదల చేసినట్లు ఉంటున్నాయి. అందుకే ఈ మద్య విడుదలైన వాటిలో హిట్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉంటున్నాయి.

తాజా అప్ డేట్ ప్రకారం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘టెంపర్’ మూవీ సూపర్ గా ఉంటుందని ప్రి రిలీజ్ టాక్ వస్తోంది. తారక్ పవర్ ఫుల్ యాక్షన్, సిక్స్ ప్యాక్ బాడి, పూరీ స్టోరి హైలైట్ అవుతాయని అనలిస్టులు చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత కసితో సినిమా తీస్తున్న పూరీ.., తానేంటో నిరూపించేందుకు చాలా కష్టపడుతున్నారని చెప్తున్నారు. అదే విధంగా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డ ఎన్టీఆర్ కూడా సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారని చెప్తున్నారు. అయితే ఈ ప్రి రిలీజ్ టాక్ అంతా నిర్మాత బండ్ల గణేష్ కేంద్రంగా మొదలు కావటంతో నమ్మాలో లేదో తెలియటం లేదు.

బి. గణేష్ అంటే బండ్లకు బదులు.., బ్లాక్ బస్టర్ గణేష్ గా ఇండస్ర్టీలో పేరు వచ్చేసింది. అలాంటి వ్యక్తి సినిమా సూపర్ హిట్ అని చెప్పటంతో నమ్మాలి అన్పిస్తుంది. ఇదే సమయంలో మిగతా సినిమాలు, బండ్ల మాటల గురించి ఆలోచిస్తే మాత్రం నిజమంటారా...? అని డౌట్ వస్తుంది. ఈ కన్ఫ్యూజన్ కు తెర పడాలి అంటే.., సినిమా విడుదల కావాల్సిందే. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, ఫిబ్రవరి 5న విడుదల కానుంది. జనవరి చివరి వారంలో ‘టెంపర్’ ఆడియో రిలీజ్ ఉంటుందని మూవీ యూనిట్ ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Temper movie  ntr  tollywood latest  

Other Articles