Hansika disappoint with ambala movie

Ambala movie, Ambala movie talk, Ambala movie review, Ambala movie rating, Ambala public talk, Ambala movie updates, Ambala movie wallpapers, Hansika in Ambala movie, Hansika wallpapers, Hansika next movie, Vishal next movie, kollywood updates, tollywood upcoming movies

Hansika disappoint with Ambala movie : Heroine Hansika feels disappoint with her latest tamil movie Ambala. Hero Vishal lead played Ambala movie got below average talk. Hansika feels her risk for learning sword art, and exercises went loss with Ambala movie result

అంతా అయిపోయింది ! ఇప్పుడెలా..? కుమిలిపోతున్న హన్సిక

Posted: 01/17/2015 03:13 PM IST
Hansika disappoint with ambala movie

ఎనమిదేళ్ళ క్రితం ఇండస్ర్టీకి వచ్చిన హన్సిక ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చింది. పదహారేళ్ళ ప్రాయంలోనే హీరోయిన్ గా ఫ్రేములోకి వచ్చి, అనేక సినిమాలు చేసి పేరు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తమిళంలో ఈ అమ్మడికి చాలా డిమాండ్ ఉంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. అలా నటించినవాటిలో ఓ మూవీ అమ్మడిని బాగా బాధపెడుతోంది. ఎందుకు ఇంత కష్టపడ్డాను.., ఏం లాభం వచ్చింది అని ఆవేదన చెందుతోంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమా కుప్పకూలిపోవటంతో ఏం చేయాలో హన్సికకు తెలియటం లేదు.

విశాల్ లేటెస్ట్ మూవీ ‘అంబాల’ సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదల అయింది. విడుదలకు ముందు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజ వంశ కథలో హన్సిక యువరాణి పాత్ర పోషించింది. పోరాటాలు ఉండే ఈ కథ కోసం హీరోయిన్ బాగా కష్టపడింది. కత్తి యుద్ధంలో మెలుకువలు నేర్చుకుంది. చేతులు కాయలు కాసినా.., భరించి ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ట్రైనింగ్ వల్ల మృదువుగా ఉండే ఆమె చేతులు రఫ్ గా మారినా పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేసింది. ఇందుకు తగ్గట్టే సినిమాలో సన్నివేశాలు కూడా చాలా బాగా వచ్చాయి. దీంతో తన కష్టం ఫలించే సమయం వస్తుందని ఆశించింది.

అయితే సంక్రాంతికి విడుదలైన సినిమాకు వీక్ టాక్ వచ్చింది. యావరేజ్ గా ఉంది అని కూడా ఎవరూ చెప్పకపోవటంతో కలెక్షన్ పాయింట్స్ టపా టపా పడిపోయాయి. సంక్రాంతి సీజన్ ఇంకా కొనసాగుతున్నా.., సినిమాకు మాత్రం క్రేజ్ అప్పుడే పడిపోయింది. ఇందుకు ప్రధాన కారణం... కథ, స్ర్కీన్ ప్లే. పాత కాలం కథకు, ఓవర్ యాక్షన్ సీన్లు, ఓవర్ డోస్ కామెడి అసలు కథను చెడగొట్టాయి. హిట్ అవుతుంది అనుకున్న సినిమా ఫ్లాపు కావటంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిందని ఆవేదన చెందుతోంది. ఎన్నో ఆఫర్లు వచ్చినా ఈ సినిమా కోసం వాటిని వదులుకుంటే రిజల్ట్ ఇలా వచ్చిందేమిటి అని బాధపడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ambala  Hansika  Vishal movies  

Other Articles