A r rahmans i movie special show for doctors

A R Rahman, A R Rahman movies, A R Rahman special show, A R Rahman latest updates, A R Rahman songs, A R Rahman altime hits, I movie collections, I movie records, I movie updates, I movie latest news, I movie wallpapers, tollywood updates, Bollywood latest, Kollywood Latest Updates

A R Rahmans i movie special show for doctors : music director A R Rahman booked a theater for special show to doctors. Rahman to give thanks doctors by his latest movie i. shankar movie going with mixture of response from audience

అలా రుణం తీర్చుకుంటున్నాడా...!

Posted: 01/17/2015 04:55 PM IST
A r rahmans i movie special show for doctors

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహ్మాన్ కు రుణం తీర్చుకునే టైమ్ వచ్చింది. సాయం చేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సినిమాను చూపించేందుకు రెహ్మాన్ సిద్ధం అయ్యాడు. తన తల్లికి వైద్యం చేసిన డాక్టర్లకు కృతజ్ఞతగా, లేటెస్ట్ మూవీ ‘ఐ’ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నాడు. డాక్టర్లు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్ మొత్తాన్ని బుక్ చేశాడు. ప్రత్యేకంగా ప్రదర్శించే ఈ షోలో డాక్టర్లు కోరుకునే ఫుడ్ ఐటమ్స్ ను ఇంటర్వెల్ లో అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు.

సినిమా విడుదలై వారం రోజులు కూడా కాలేదు. అన్ని థియేటర్లు ప్రేక్షకులతో నిండిపోయి హౌజ్ ఫుల్ కలెక్షన్లు పొందుతున్నా.., హౌజ్ ఫుల్ కలెక్షన్ ను ఒక్కడే ఇచ్చేసి తనకు సాయం చేసిన వారికి సినిమా చూపించి ఆనందింపచేయాలని తపన పడుతున్నాడు. సంగీత సామ్రాట్ కోరికను కాదనలేని డాక్టర్లు కూడా సినిమా స్పెషల్ షో చూసేందుకు ఒప్పుకున్నారు.

జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘ఐ’ సినిమా మిక్స్ టాక్ పొందుతోంది. కొందరు అభిమానులు బాగుందనీ.., ఇంకొందరు ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు. సంక్రాంతి సీజన్ కావటంతో హిట్, ఫ్లాప్ అనే టాక్ తో సంబంధం లేకుండా సినిమా బాగానే ఆడుతుంది. ఈ వారం గడిస్తే అసలు రిజల్ట్ బయటపడుతుంది. మూవీలో విక్రమ్ యాక్టింగ్ సూపర్ అని అందరూ మెచ్చుకుంటున్నారు. అటు విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయని టాక్ వస్తోంది. కథలో బలం లేకపోయినా.., యాక్టింగ్ చూసేందుకు చాలామంది థియేటర్ కు వస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : A R Rahman  I movie  Shankar movies  

Other Articles