Aishwarya rai bachchan latest photo shoot bollywood movies news

aishwarya rai bachchan, aishwarya rai bachchan latest news, aishwarya rai bachchan latest photos, aishwarya rai bachchan movies, aishwarya rai bachchan bollywood news, aishwarya hot photos

aishwarya rai bachchan latest photo shoot bollywood movies news : aishwarya rai latest glamourous photos

‘ఐ’ష్.. గగనతలం నుంచి దిగొచ్చినట్లుంది!

Posted: 01/09/2015 03:25 PM IST
Aishwarya rai bachchan latest photo shoot bollywood movies news

ఒకానొక సమయంలో యావత్తు ప్రపంచాన్ని తన అందచందాలతో వలలో వేసుకున్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్.. పెళ్లైన తర్వాత బొద్దుగా తయారైన విషయం తెలిసిందే! ఒక బిడ్డకు తల్లైన ఈ అమ్మడు నిత్యం చీరకట్టులో భారతీయ ఇల్లాలిగా తలపించే విధంగా వుండేది. ఓ సామాన్య గృహిణిలాగే తన జీవితాన్ని గడిపింది. కానీ.. ఇప్పుడు మాత్రం అల్ట్రామోడ్రన్ మోడల్’లా ట్రాన్స్’ఫార్మ్ అయినట్లు తయారైంది. ఈ అమ్మడు!

ఒక్కసారిగా రంగు, రూపం, డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మారిపోయింది. ప్రస్తుతం ఆమెను చూస్తే.. ‘‘అసలు ఆమె ఓ బిడ్డకు తల్లేనా’’ అని నోళ్లవేళ్లబెట్టుకుని ఆశ్చర్యంలో మునిగిపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. గగనతలం నుంచి దిగొచ్చిన దేవకన్యలా కనువిందు చేసింది. కేవలం 3 నెలల్లోనే తన శరీరాకృతిని పూర్తిగా మార్చేసిన ఐష్.. ఇప్పుడున్న యువకథానాయికలకు గట్టిపోటీనివ్వడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. నిన్నమొన్నటివరకు బొద్దుగా కనిపించిన ఈ భామ.. అనుకోకుండా ఇలా టీనేజ్ గర్ల్’లా కనిపించి అందరిని షాక్’కు గురిచేసేసింది.

ఇదిలావుండగా.. ఐశ్వర్య ప్రస్తుతం కరణ్ జోహర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తోంది. అంతేకాదు.. వేరొక దర్శకుడితో కూడా సినిమా చేసేందుకు కమిట్ అయినట్లు సమాచారం. వీటితోబాటు కొన్ని వాణిజ్య ప్రకటనలు చేసేందుకు కూడా ఈమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్! ఇలా వరుసగా ఈమె అన్నిరంగాల్లోనూ దూసుకుపోతే.. గతంలో ఈమెకు లభించిన ఇమేజ్ మళ్లీ తిరిగొస్తుందని అనుకుంటున్నారు. ఏంతైనా మాజీ విశ్వసుందరి కదా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aishwarya rai bachchan  bollywood movies  telugu news  

Other Articles