Rakul preet singh remuneration junior ntr sukumar combo movie news

rakul preet singh latest news, rakul preet singh remuneration, rakul preet singh hot photo shoot, rakul preet singh bikini photos, rakul preet singh hottest gallery, rakul preet singh charges, junior ntr sukumar movie, junior ntr movies

rakul preet singh remuneration junior ntr sukumar combo movie news : rakul preet singh charging 70 lakhs for junior ntr and sukumar combo movie.

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది...

Posted: 01/09/2015 03:48 PM IST
Rakul preet singh remuneration junior ntr sukumar combo movie news

ప్రస్తుతం నటి రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం చూస్తుంటే.. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుంది! ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని నెలల్లోనే హీరోయిన్’గా తనకంటూ ప్రత్యేక ప్రస్థానం ఏర్పరుచుకున్న ఈ పంజాబీ సెక్సీ భామ.. వరుసగా హిట్లు అందుకుంటూ చిన్నిహీరోయిన్లతోబాటు అగ్రతారలను వెనక్కి నెట్టేసుకుంటూ దూసుకుపోతోంది. 2014లో తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్’ఫుల్ హీరోయిన్’గా పేరుతెచ్చుకున్న ఈ భామ.. పరభాష చిత్రాల్లోనూ అవకాశం అందిపుచ్చుకుంటోంది. అందుకేనేమో.. తన పారితోషికాన్ని భారీగా పెంచేసింది.

మొదట ‘వెంకటాద్రి ఎక్స్’ప్రెస్’ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతోబాటు రకుల్ ప్రీత్ నటిగా మంచి గుర్తింపు కూడా పొందింది. దాంతో ఈ భామ అమాంతంగా 30 లక్షల పారితోషికాన్ని పెంచేసింది. ఆ తర్వాత ఈమె నటించిన చిత్రాలు ఒకదాని తర్వాత మరొకటి భారీ విజయాలనే అందుకున్నాయి. ఒకేసారి మూడు హిట్లను అందుకుంది. పైగా హిందీలోనూ ఓ సినిమా చేస్తోంది. దీంతో ఈమె మరోసారి తన పారితోషికంగా భారీగా పెంచేసినట్లు ఇండస్ట్రీవర్గాల సమాచారం!

జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే! ఈ చిత్రంలో కథానాయికగా ఎంతోమందిని టెస్ట్ చేసిన అనంతరం చివరకు రకుల్ ప్రీత్ సింగ్ కమిట్ అయింది. ఇలా ఈ అవకాశాన్ని అనుకోకుండా అందిపుచ్చుకున్న ఈ అమ్మడు.. ఆ మూవీకి 70 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు ట్రేడ్ టాక్! ఎలాగూ భారీ బడ్జెట్టుతో సినిమా కాబట్టి.. యూనిట్ మెంబర్లు ఆమెకు ఆ పారితోషికం ఇవ్వడానికి సిద్ధమైందట! ఇలాగే ఈ అమ్మడు మరో రెండు హిట్లు సాధిస్తే.. కోటి క్లబ్’లో చేరడం ఖాయమని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rakul preet singh remuneration  junior ntr sukumar movie  tollywood news  

Other Articles