Anushka rudramadevi movie highlight fights scenes

anushka shetty, rudramadevi movie, director guna shekhar, daggubati rana, allu arjun, anushka shetty rudramadevi movie, daggbati rana chalukya raju role, allu arjun gona gannareddy role, anushka hot photo shoot, anushka hot gallery, anushka photo sessions

anushka rudramadevi movie highlight fights scenes : rudramadevi movie unit members talking about anushka role.

షాకింగ్ న్యూస్ : అనుష్క అసలు ఆడది కాదట!

Posted: 01/09/2015 01:07 PM IST
Anushka rudramadevi movie highlight fights scenes

టైటిల్ చదవడానికి కాస్త షాకింగ్’గా వున్నా.. ప్రస్తుతం సినీఇండస్ట్రీలో అందరూ ఇలానే అనుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క భారీ ప్రతిష్టాత్మక-చారిత్రాత్మక ‘రుద్రమదేవీ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 3డీ స్టీరియోపిక్’లో ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఈ అమ్మడు చేసిన పోరాట సన్నివేశాలను చూస్తే.. ఎవరైనా ఆమెను ఆడమహిళగా గుర్తించరని, మగరాయుడిలా ఎంతో అద్భుతంగా నటించిందని అంటున్నారు ఆ మూవీ యూనిట్ సభ్యులు.

ఈ చిత్రంలో అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ వున్నాయట! అంతేకాదు.. ఓ పాత్రలో ఆమె పూర్తి మగరాయుడిలా కనువిందు చేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో అనుష్క సారథ్యంలో సైన్యం శత్రరాజ్యంపై దండెత్తే ఎపిసోడ్ వుంది. ఆ మొత్తం సన్నివేశమే ఈ చిత్రానికి హైలైట్’గా నిలుస్తుందని అంటున్నారు. అంతేకాదు.. కొన్ని కీలక సన్నివేశాల్లో అనుష్క అచ్చం మగాడిలానే తన రుద్రరూపాన్ని చూపించినట్లుగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారని అంటున్నారు. ఆ వేషం సినిమాకే హైలైట్’గా నిలుస్తుందని అనుకుంటున్నారు.

నిజానికి ఆనాడు కాకతీయ సామ్రాజ్యంలో మొదటిసారిగా ఓ యువతికి కిరీటం అందించినప్పుడు ఆమెను మగాడిగానే పరగణించారు. రుద్రమదేవీ అని కాకుండా రుద్రదేవ అని ప్రస్థావించుకునేవారు. అందుకు తగ్గట్టుగానే ఆమె తన విధులు నిర్వర్తించి చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు ఈ చిత్రంలో కూడా అనుష్కని అదేవిధంగా చూపించారని అంటున్నారు. ఇదిలావుండగా.. ఈ చిత్రంలో దగ్గుబాటి రానా నిడదవోలు చాళుక్యరాజుగా నటిస్తుండగా.. అల్లుఅర్జున్ గోనగన్నరాజు పాత్రలో కనువిందు చేయనున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles