Ravi teja sundeep kishan tiger title problems

Ravi Teja Bengal Tiger problems, Bengal Tiger title problems, Sundeep Kishan Tiger movie, Sundeep Kishan Tiger movie title problems, Bengal Tiger movie updates, Bengal Tiger latest news, Bengal Tiger movie wallpapers, Ravi Teja vs Sundeep Kishan, Ravi Teja latest updates, Ravi Teja wallpapers, Sundeep Kishan next movie, upcoming telugu movies

Ravi Teja Sundeep Kishan Tiger title problems : Ravi Teja have a title war with Sundeep Kishan Tiger movie which seems to be same for audience. Mass Maharaja and Sampath Nandi fighting with film chamber on title problem with Sundeep Kishan

టైగర్ వేరైనా టైటిల్ పై గొడవ తప్పట్లేదు

Posted: 01/08/2015 05:15 PM IST
Ravi teja sundeep kishan tiger title problems

సినిమా టైటిల్స్ పై ఈ మద్య వివాదాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. సేమ్ టైటిల్ పెట్టారనీ.., దగ్గరగా ఉండేలా పేరు పెట్టారనీ, కాపి కొట్టి రిజిస్ర్టేషన్ చేయించుకున్నారనీ ఇలా వరుసగా ఏదో ఒక రూపంలో టైటిల్ వివాదాలు ఫిలిం ఛాంబర్ కు వస్తున్నాయి. పేర్ల గొడవలతో ఫిలిం ఛాంబర్ పెద్దలు తలపట్టుకుంటున్నారు. బాలయ్య వివాదం ముగిసి కొద్ది రోజులవుతుండగానే రవితేజ రచ్చ మొదలైంది. సంపత్ నంది తెరకెక్కిస్తున్న సినిమాలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ‘బెంగాల్ టైగర్’ అనే పేరు కూడా పెట్టారు.

అటు సందీప్ కిషన్ హీరోగా ‘టైగర్’ అనే సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. సందీప్ సినిమాకు ‘టైగర్’ టైటిల్ పెట్టడంపై సంపత్ నంది, రవితేజ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ మూవీ ‘బెంగాల్ టైగర్’కు ఇది దగ్గరగా ఉందని కారణం చూపిస్తున్నారు. వాస్తవంగా చెప్పలంటే రవితేజకు సందీప్ పోటీ కాదు, కానీ.., టైటిల్ వల్ల మాస్ ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారని రవి వాదిస్తున్నాడు. ఇదే అంశాన్ని సంపత్ తో కలిసి ఫిలించాంబర్ పెద్దలకు వివరించాడు. సందీప్ టైటిల్ మార్చుకునేలా ఇద్దరూ కలిసి ఒత్తిడి తెస్తున్నారు.

కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎవరికి సర్ధి చెప్పాలో తెలియటం లేదట. చిన్న హీరోలపై ఇలాంటి ఒత్తిడులు సహజమే కానీ.., రవి తేజ లాంటి వ్యక్తుల నుంచి కూడా ఇబ్బందులు రావటంపై ‘టైగర్’ మూవీ యూనిట్ విచారం వ్యక్తం చేస్తోంది. మాస్ మహారాజాకు పోటిగా తాము ఈ టైటిల్ పెట్టలేదనీ.., కాబట్టి సంపత్ నంది అండ్ కో అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ వివాదం చివరకు ఎటు వెళుతుందో. శీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘టైగర్’ షూటింగ్ ఈ మద్యే కాశీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరోవైపు సందీప్ ‘బీరువా’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. రవితేజ విషయానికి వస్తే.., ప్రస్తుతం ‘కిక్2’లో నటిస్తున్న మాస్ మాహారాజా, త్వరలోనే ‘బెంగాల్ టైగర్’ షూటింగ్ లోకి వస్తారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja latest  Bengal Tiger movie  Sundeep Kishan updates  

Other Articles