Gopala gopala censor report

Gopala Gopala movie, Gopala Gopala censor, Gopala Gopala censor report, Gopala Gopala U certificate, Gopala Gopala release date, Gopala Gopala movie release date, Gopala Gopala latest updates, Gopala Gopala wallpapers, Gopala Gopala movie updates, Gopala Gopala trailer, Gopala Gopala teaser, Gopala Gopala songs, Pawan Kalyan in Gopala Gopala, Venkatesh in Gopala Gopala, upcoming telugu movies

Gopala Gopala censored : Gopala Gopala movie completed censor process and got U certificate. dil raju confirms that Pawan Kalyan Venkatesh Combination movie going to release on 10th january 2015. Gopala Gopala cast and crew and fans feels happy over censor report

‘గోపాల గోపాల’ అందరికి.. సెన్సార్ అప్ డేట్

Posted: 01/08/2015 05:40 PM IST
Gopala gopala censor report

పవన్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునే విషయమిది. పవర్ స్టార్ కృష్ణుడిగా నటిస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా చూసిన బోర్డు సభ్యులు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. అంటే ఈ సినిమాను పిల్లలు, పెద్దలూ, కుటుంబమంతా కలిసి చూడవచ్చన్నమాట. సెన్సార్ రిపోర్ట్ పై పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండగకు కుటుంబమంతా చూసే సినిమా రావటం ఆనందం కల్గిస్తోందన్నారు. ఈ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని.., ‘ఐ’ కి పోటిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కీలకమైన సెన్సార్ పనులు పూర్తి కావటంతో.., సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు. ‘గోపాల గోపాల’కు నైజాం డిస్ర్టిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు మూవీ జనవరి 10న విడుదల అవుతుందని ప్రకటించారు. ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు. అటు సీడెడ్ లో కూడా 10న బ్రహ్మాండమైన విడుదల అంటూ గోడలపై సినిమా పోస్టర్లు కన్పిస్తున్నాయి. హిందుత్వాన్ని కించపర్చేలా ఉందని ఆరోపిస్తూ హిందూ, ధార్మిక సంఘాలు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి సమయంలో సినిమాకు క్లీన్ ‘యు’ రావటం అంటే.., ఈ మూవీలో ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు, మాటలు లేవని స్పష్టం అవుతోంది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వస్తున్న ఏకైక తెలుగు సినిమా ఇదే. హిందీ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ కంటే పెద్ద హిట్ అవుతుందని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ తో పాటు, మూడు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. దీంతో సూపర్ హిట్ ఖాయమంటున్నారు. సినిమా విడుదలకు మరో రెండ్రోజులే ఉండటంతో ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్ ఎఫ్పుడెప్పుడు 10వ తేదీ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  Pawan kalyan latest look  Venkatesh movie  

Other Articles