Legend movie 275 days celebrations

Legend Movie, Legend Movie records, Legend Movie 275 days, Legend Movie 275 days function photos, Legend Movie 275 days celebrations, Legend Movie collections, Balakrishna movies, Balakrishna upcoming movies, Balakrishna satyadeva movie, Balakrishna latest, Balakrishna photos, tollywood latest, tollywood updates, latest telugu movies, upcoming telugu movies

Legend 275 Days Celebrations : Nandamuri Balakrishna Legend Movie Completes 275 days in proddutoor. Legend 275 days celebrations make colourful and josh full with balakrishna presence, fans feels happy with nandamuri lion

‘లెజెండ్’కు పట్టాభిషేకం

Posted: 12/29/2014 08:38 AM IST
Legend movie 275 days celebrations

ఎంతైనా బాలయ్యంటే., బాలయ్యే. సినిమాలు వారం రోజులు ఆడటం కూడా గగనం అవుతున్న రోజుల్లో ఒక సినిమా నెలల తరబడి ఆడటం అనే మాట ఊహించలేము. సినిమాల్లో ఊహకు అందని స్టంట్లు చేసే నందమూరి నటసింహం.., రియల్ లైఫ్ లో కూడా ఊహకు అందని రికార్డులు నమోదు చేస్తోంది. ‘లెజెండ్’ సినిమా 275 రోజులు పూర్తి చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో సినిమా 275 ప్రదర్శించబడింది. ఇప్పటికి ఒక యజ్ఞంలా ఈ సినిమా ప్రదర్శన కొనసాగుతోంది.

ఈ విశేషాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని థియేటర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, మూవీ యూనిట్ సభ్యులు, పలువురు నటులు పాల్గొన్నారు. ‘లెజెండ్’తో తమ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ప్రముఖ నటుడు చలపతిరావు.., అప్పట్లో ఎన్టీఆర్ సినిమాలు తెగ చూసేవాడినన్నారు. మూవీలో మహానటుడు కన్నీళ్ళు పెడితే తమకూ ఏడుపు వచ్చేదన్నారు. ‘లెజెండ్’ సినిమా చూస్తే కూడా తనకు కన్నీళ్ళు వచ్చాయన్నారు. అంత గొప్పగా తండ్రికి తగ్గ తనయుడుగా నటిస్తున్నారని ప్రశంసించారు.

విజయోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు సమీర్... తనకు ఎన్టీఆర్ తో నటించాలన్న కోరిక ఉండేదన్నారు. ఈ కోరిక బాలయ్యతో నటించటంతో తీరిందని చెప్పారు. ఈ మూవీపై డైరెక్టర్ బోయపాటి తనతో చెప్పిన మాటను గుర్తుకు చేశారు. ‘సింహ’ అంటే ఒకే సింహం.., ‘లెజెండ్’ అంటే పది సింహాలు అని చెప్పారు. దీన్నిబట్టే సినిమా ఏ స్థాయిలో ఎనర్జీగా ఉంటుందో అర్థం చేసుకున్నాను అని తెలిపారు. ఇక కార్యక్రమానికి వచ్చిన ఫ్యాన్స్ బాలయ్యను చూసి కోలాహలంలో మునిగితేలారు. రాజసింహాసనం తరహాలో ఏర్పాటు చేసిన కుర్చీలో నటసింహం కూర్చుని ఫ్యాన్స్ కు కన్నుల పండువ చేశారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Legend Movie  Balakrishna  Tollywood records  

Other Articles